AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్
AK-47 rifles | బీహార్‌లోని సివాన్ (Siwan) జిల్లాలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై AK-47 రైఫిళ్లను (AK-47 rifles) వినియోగించడంపై కాంగ్రెస్ (Congress) పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ( Pawan Khera) డిమాండ్ చేశారు.
AK-47 rifles | బీహార్‌లోని సివాన్ (Siwan) జిల్లాలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై AK-47 రైఫిళ్లను (AK-47 rifles) వినియోగించడంపై కాంగ్రెస్ (Congress) పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ( Pawan Khera) డిమాండ్ చేశారు. పోలీసుల చర్యపై ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఖేరా.. ఈ ఘటనపై హోం మంత్రి స్పందించే వరకూ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయని వెల్లడించారు. "బీహార్‌లో యువతపై AK-47ను ఉపయోగించినట్లు రుజువైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి ఈ ఘటనపై ప్రకటన చేయాలి. అప్పటి వరకూ మేము ఈ అంశంపై సభలో మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. సభ సజావుగా సాగినివ్వం" అని ఆయన తేల్చి చెప్పారు.
ప్రధాని క్షమాపణలు చెప్పాలి : రాహుల్
ఇక విద్యార్థులపై ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు విద్యార్థులపై అణచివేత ధోరణిని కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్‌లు ప్రయోగించారని, బీహార్‌లో ఏకే-47తో కాల్పులు జరిపారని రాహుల్ ఆరోపించారు. విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దేశ యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ కాల్పులు జరుపుతున్న వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన ఆయన.. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు.
దేశవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా జులై 25న బీహార్‌లో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా సివాన్‌లో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గాంధీ మైదాన్‌వైపు మార్చ్ తీశారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరిపారు. ఓ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌తో విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
🚨Policeman who fired AK-47 during student's protest in Bihar's Siwan has been suspended pic.twitter.com/EufVYO6s8j
— The Tatva (@thetatvaindia) July 27, 2026
Also Read..
ప్రారంభించిన 12 రోజులకే.. కుంగిపోయిన రూ.4,700 కోట్ల లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే
హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు.. త్వరగా లాగ్ అవుట్ అవ్వండి..
ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ..! ఎమ్మెల్సీ దాసోజు సెటైర్
సంబంధిత వార్తలు

Harish Rao | దానం వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు : హరీశ్‌రావు
సెప్టెంబర్ 18, 2026

Rahul Gandhi | మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
సెప్టెంబర్ 18, 2026

Karnataka MLAs niece | పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!



