Lucknow-Kanpur expressway | ప్రారంభించిన 12 రోజులకే.. కుంగిపోయిన రూ.4,700 కోట్ల లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే
Lucknow-Kanpur expressway | రూ.4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (Lucknow-Kanpur expressway) ప్రారంభించిన 12 రోజులకే కుంగిపోయింది. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు దెబ్బతిన్న రహదారిపై యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
Lucknow-Kanpur expressway | జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలపై మరోసారి చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో (UP) వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఓ జాతీయ రహదారి ప్రారంభించిన 12 రోజుల్లోనే కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిర్మాణంలో నాణ్యతా లోపాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (Lucknow-Kanpur expressway)ని రూ.4,700 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం 63 కిలోమీటర్ల పొడవైన ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేని జులై 13న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ రహదారి దేశంలో రెండో అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంది. కంప్యూటర్, ఉపగ్రహ ఆధారిత ఆటోమేటెడ్ మెషిన్ గైడెన్స్ నిర్మాణ వ్యవస్థతో నిర్మించిన దేశంలోని తొలి ఎక్స్‌ప్రెస్‌వే ఇది. అయితే, ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఉన్నావ్ సమీపంలో రోడ్డు కొంతమేర కుంగిపోయింది.
సమాజ్‌వాదీ పార్టీ నేత మధుసూదన్ యాదవ్ (Madhusudan Yadav) ఎక్స్‌ప్రెస్‌వేపై దెబ్బతిన్న రోడ్డు వీడియోని ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్నో-కాన్పూర్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేపై కొరారి గ్రామం సమీపంలో రోడ్డు ఐదు నుంచి ఏడు మీటర్ల మేర కుంగిపోయిందని ఆయన తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో నిర్మాణ నాణ్యతపై స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాణ్యతా లోపంపై కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోతో అప్రమత్తమైన అధికారులు దెబ్బతిన్న రహదారిపై యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
Also Read..
రంగనాథ్‌ను తప్పించండి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లలో భారీ ర్యాలీ.. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం..
రాబోయే 4 రోజులు భారీ వర్షాలు..! 100 మి.మీ.పైనే వర్షపాతం నమోదు..!!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
సెప్టెంబర్ 5, 2026

Kashi Vishwanath temple | కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద కాల్పుల కలకలం.. ముగ్గురికి గాయాలు
జులై 4, 2026

Fire | పేలిన ఏసీ యూనిట్.. రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!



