త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prajwal Revanna | ప్ర‌జ్వ‌ల్ ఫోన్‌లో డ‌జ‌న్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేష‌ణ‌లో వెలుగులోకి షాకింగ్ విష‌యాలు

Prajwal Revanna | మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవ‌ణ్ణ ‌(Prajwal Revanna) మొబైల్ ఫోన్‌లో డ‌జ‌న్ల కొద్దీ పోర్న్ వీడియోలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

D

National | Published On Sep 12, 2026, 1.20 pm IST

Prajwal Revanna | ప్ర‌జ్వ‌ల్ ఫోన్‌లో డ‌జ‌న్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేష‌ణ‌లో వెలుగులోకి షాకింగ్ విష‌యాలు
Advertisement

Prajwal Revanna | త్రినేత్ర‌.న్యూస్ : అత్యాచారం కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభ‌విస్తున్న‌ జ‌న‌తాద‌ళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవ‌ణ్ణ ‌(Prajwal Revanna) మొబైల్ ఫోన్ దొరికిన విష‌యం తెలిసిందే. ఆ ఫోన్‌, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను ఫోరెన్సిక్ విశ్లేష‌ణ చేయ‌గా షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. వాటిల్లో డ‌జ‌న్ల కొద్దీ పోర్న్‌ వీడియోలు (Porn Videos) వెలుగు చూశాయి.

ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌ ప్ర‌స్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష (Bengaluru Prison) అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, గ‌త నెల జైల్లో అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ దాడుల్లో ఫోన్‌తో రేవ‌ణ్ణ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. లోదుస్తుల్లో ఫోన్ దాచిన‌ట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఆయ‌న వ‌ద్ద ఓ పెన్‌డ్రైవ్, ఛార్జర్ కూడా బ‌య‌ట‌ప‌డింది. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఫోరెన్సిక్ విశ్లేష‌ణ‌కు పంపారు. ఫోన్‌లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు, పెన్ డ్రైవ్‌లో వెబ్ సిరీస్‌లు ఉన్నట్లు గుర్తించారు.

ప్రజ్వల్ రేవణ్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ హోలినరసిపుర రూపల్ పోలీస్ స్టేషన్‌లో 48 ఏండ్ల మహిళ ఫిర్యాదు చేసింది. 2021లో త‌న‌పై రెండుసార్లు లైంగిక దాడి చేశార‌ని ఆరోపించింది. అంతేకాక ఆ దారుణాన్ని మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన‌ట్లు తెలిపింది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు హసన్‌లోని అతని ఫామ్‌హౌస్‌ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచార ఆరోప‌ణ‌లు రావ‌డంతో అత‌ను జ‌ర్మ‌నీకి పారిపోయాడు. ఆ త‌ర్వాత తిగిరి వ‌చ్చిన వెంట‌నే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా కేసుల్లో కోర్టు ఆయ‌న్ని దోషిగా తేల్చి జీవిత‌ఖైదు విధించింది. ఇక రేవణ్ణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు.

Also Read..

జిన్‌పింగ్ భార‌త ప‌ర్య‌ట‌న వేళ కీల‌క ప‌రిణామం.. ఆరేళ్ల‌ తర్వాత ఢిల్లీకి చైనా విమాన సర్వీసులు

వారి వ‌ల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొన‌సాగుతోంది : పుతిన్‌

శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?

Advertisement
Advertisement