TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?
TTD | కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ (TTD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ నెలకు (December Quota) సంబంధించిన దర్శన (Darshan), గదుల (Accommodation) కోటాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
TTD | త్రినేత్ర.న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ (TTD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ నెలకు (December Quota) సంబంధించిన దర్శన (Darshan), గదుల (Accommodation) కోటాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలని, అనంతరం వారికి టికెట్లు మంజూరవుతాయని వెల్లడించింది.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను అదేరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
తాజావార్తలు
- ●Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త
- ●Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బలితీసుకున్న భూ వివాదం
- ●Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన
- ●Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ
- ●Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
- ●Loan Prepayment | లోన్‌ను ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా.. అసలు నిజం ఇదే..

Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త

Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బలితీసుకున్న భూ వివాదం

Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన

Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ






