Delhi To Guangzhou direct flights | జిన్‌పింగ్ భారత పర్యటన వేళ కీలక పరిణామం.. ఆరేళ్ల తర్వాత ఢిల్లీకి చైనా విమాన సర్వీసులు
Delhi To Guangzhou direct flights | బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత చైనా (China)లోని గ్వాంగ్‌జౌ నుంచి ఢిల్లీకి (Delhi To Guangzhou direct flights) ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Delhi To Guangzhou direct flights | త్రినేత్ర.న్యూస్ : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత చైనా (China)లోని గ్వాంగ్‌జౌ నుంచి ఢిల్లీకి (Delhi To Guangzhou direct flights) ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. బ్రిక్స్ సదస్సు (BRICS Summit) కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనకు కొన్ని గంటల ముందు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ఈ కీలక ప్రకటన చేసింది. గ్వాంగ్‌జౌ- ఢిల్లీ (Delhi To Guangzhou) మధ్య నేరుగా విమాన సర్వీసులను సెప్టెంబర్ 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గినా 2020లో తూర్పు లఢఖ్‌లో ఉద్రిక్తతల వల్ల విమాన సర్వీసుల పునరుద్ధరణ సాధ్యం కాలేదు. ఫలితంగా గత ఆరేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, ఇటీవలే కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు కొనసాగించడంతో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన కనెక్టివిటీ పునరుద్ధరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీ-చైనా మధ్య సర్వీసులను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 30న కోల్‌కతా-షాంఘై మధ్య ఇండిగో తన మొట్టమొదటి డైరెక్ట్ నాన్‌స్టాప్ సేవలను ప్రారంభించింది. అనంతరం ఏప్రిల్‌లో ఎయిర్ చైనా తన బీజింగ్-ఢిల్లీ సర్వీసును పునఃప్రారంభించింది. ఇప్పుడు గ్వాంగ్‌జౌ నుంచి ఢిల్లీకి ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దక్షిణాసియా ప్రాంతంలో మొత్తం ఎనిమిది రౌండ్- ట్రిప్ మార్గాల్లో వారానికి 100కుపైగా విమానాలను నడుపుతామని చైనా సదరన్ ఎయిర్‌లైన్ తెలిపింది.
Also Read..
వారి వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోంది : పుతిన్
అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Smartwatch | స్మార్ట్ వాచ్ ధరిస్తే తలనొప్పి వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
- ●Talasani Srinivas Yadav | ఏ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామో మేము చెప్పినమా?.. సీఎం తలసాని
- ●Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్
- ●Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్
- ●Vladimir Putin | వారి వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోంది : పుతిన్
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇక ట్యాగ్ చేసిన పోస్టులూ ప్రొఫైల్‌లోనే..

Smartwatch | స్మార్ట్ వాచ్ ధరిస్తే తలనొప్పి వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?

Talasani Srinivas Yadav | ఏ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామో మేము చెప్పినమా?.. సీఎం తలసాని

Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్

Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్





