Rahul Gandhi | రాహుల్ ఓ పెద్ద జోక్.. ప్రతిపక్ష పార్టీల మధ్య చీలికకు ఆయనే కారణం.. కాంగ్రెస్ అగ్రనేతపై డీఎంకే విమర్శలు
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీపై డీఎంకే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేతను ఒక "పెద్ద జోక్" అంటూ డీఎంకే ఐటీ సెల్ ఎద్దేవా చేయగా.. రాహుల్ ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నారంటూ ఆ పార్టీ అధికారిక పత్రిక 'మురసోలి' (Murasoli) ఆరోపించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీల మధ్య వైరం మరింత ముదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న హస్తం పార్టీ డీఎంకేతో దశాబ్దాలపాటూ ఉన్న బంధాన్ని కూడా కాదని విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో హస్తం పార్టీతో డీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై డీఎంకే తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేతను ఒక "పెద్ద జోక్" అంటూ డీఎంకే ఐటీ సెల్ ఎద్దేవా చేయగా.. రాహుల్ ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నారంటూ ఆ పార్టీ అధికారిక పత్రిక 'మురసోలి' (Murasoli) ఆరోపించింది.
డీఎంకే ఐటీ సెల్ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టింది. "కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నప్పుడు వారిని మేం మా భుజాలపై మోశాము. కానీ కొత్త మెరిసే బొమ్మ కనబడగానే వారు మమ్మల్ని కాదని అటువైపు దూకేశారు" అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను పెద్ద జోక్‌గా అభివర్ణించింది.
ఇక ఇదే సమయంలో డీఎంకే అధికారిక పత్రిక ‘మురసోలి’ తన సంపాదకీయంలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్ష పార్టీల మధ్య చీలికలకు రాహులే కారణమని సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవలే జరిగిన ఇండియా కూటమి (INDIA bloc) సమావేశంలో ప్రతిపక్షాల ఐక్యత గురించి రాహుల్ మాట్లాడటంపై విమర్శలు గుప్పించింది. "రాహుల్ గాంధీ ఐక్యత గురించి ఉపన్యాలు ఇస్తున్నారు.. కానీ పలు రాష్ట్రాల్లో ఆ ఐక్యతను బలహీనపరిచింది ఎవరు..?" అని ప్రశ్నించింది. ప్రతిపక్షాల మధ్య విభేదాలు రావడానికి రాహుల్ గాంధీనే కారణమని సంచలన ఆరోపణలు చేసింది.
Also Read..
స్లోవేకియా అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్






