V Hanumantha Rao | అయోధ్య విరాళాల చోరీ.. గాంధీ భవన్‌లో వీహెచ్ వినూత్న నిరసన
V Hanumantha Rao | ఇటీవలే పార్లమెంట్ ఆవరణలో అయోధ్య విరాళాల చోరీపై రాహుల్ గాంధీ, పప్పు యాదవ్ చేపట్టిన "చందా చోరీ" వ్యంగ్య ప్రదర్శన ఆకట్టుకోగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు గాంధీభవన్‌లో శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. భక్తులు ఇచ్చిన విరాళాలు ఏవిధంగా చోరీ అయ్యాయో నాటకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.
- కేంద్రాన్ని కదిలించేందుకు గ్రామ గ్రామ తిరుగుతానని ప్రకటన
- ప్రతి గుడి ముందు మౌన దీక్షకు దిగాలని భక్తులకు పిలుపు
V Hanumantha Rao | త్రినేత్ర.న్యూస్: ఇటీవలే పార్లమెంట్ ఆవరణలో అయోధ్య విరాళాల చోరీపై రాహుల్ గాంధీ, పప్పు యాదవ్ చేపట్టిన "చందా చోరీ" వ్యంగ్య ప్రదర్శన ఆకట్టుకోగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు గాంధీభవన్‌లో శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. భక్తులు ఇచ్చిన విరాళాలు ఏవిధంగా చోరీ అయ్యాయో నాటకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఓ హుండీ తయారు చేసి అందులో విరాళాలు వేస్తూ భక్తుల సొమ్ము ఏ విధంగా పక్కదారి పడుతుందో వ్యంగ్యంగా చూపించి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయాల్లో భక్తుల విరాళాలకు భద్రత లేకుండా పోయింది. అయోధ్య రామాలయం విరాళాల చోరీతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పార్లమెంట్ ఆవరణలో విరాళాల చోరీపై రాహుల్ గాంధీ- పప్పు యాదవ్ ప్రదర్శన అద్బుతంగా ఉంది. దేశ వ్యాప్తంగా అయోధ్య విరాళాలపై భక్తులు ప్రశ్నించాలి. ప్రతీ గుడి ముందు భక్తులు మౌనధీక్షకు కూర్చోవాలి అని వీహెచ్ పిలుపునిచ్చారు.

సీబీఐ ఎంక్వైరీ కావాలి..
రామునికి అన్యాయం జరిగింది. అయినా మోదీ, అమిత్ షా మాట్లాడడు. సామాన్య భక్తులు ఎంతో పవిత్రంగా ఇచ్చిన విరాళాలు, కానుకలను కొందరు ఆలయ సిబ్బంది, ఇంటి దొంగలు దోచుకోవడం అత్యంత దారుణం, విరాళాల చోరీ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గ్రామ గ్రామన తిరుగుతా. సిట్‌పై మాకు నమ్మకం లేదు.. సీబీఐ ఎంక్వైరీ కావాలి. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా అయోధ్య రామాలయం నిధుల కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి అని వీహెచ్ డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
ఆగస్టు 11, 2026

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
ఆగస్టు 11, 2026

Naveen Nicolas | పాఠశాలల భవనాలు పూర్తయ్యేలోపు ఫర్నీచర్ ఉండాలి.. నిధుల సమస్య రాకుండా చూసుకోండి
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ



