Venezuela quake | మిరాకిల్.. 8 రోజులుగా 140 టన్నుల శిథిలాల కిందే.. 100 గంటల ఆపరేషన్ తర్వాత సజీవంగా బయటకు
Venezuela quake | వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల (Venezuela quake) విధ్వంసంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. అదే సమయంలో కొందరు సజీవంగా ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే 43 ఏళ్ల హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోరెస్ (Hernan Alberto Gil Flores).
International | Published On Jul 3, 2026, 12.55 pm IST
Venezuela quake | జూన్ 24న వెనెజువెలాను వరుస భూకంపాలు (Venezuela quake) వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.1, 7.5 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనల ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఎనిమిది రోజులైపోయింది. అయినా అక్కడక్కడా శిథిలాల కింద చాలా మంది సజీవంగా కనిపిస్తున్నారు. అలా 43 ఏళ్ల హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోరెస్ (Hernan Alberto Gil Flores) రెస్క్యూ టీమ్‌కి కొన ఊపిరితో కనిపించాడు.
140 టన్నుల శిథిలాలు..
ఫ్లోరెస్.. ఓ షాపింగ్ మాల్‌లో సెక్యూరిటీ గార్డ్ (security guard)గా పనిచేస్తున్నాడు. భూకంపం ధాటికి ఆ షాపింగ్ మాల్ కూలిపోయింది. ఆ సమయంలో అతడు నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నాడు. ఒక చిన్న సెక్యూరిటీ క్యాబిన్ లోపల ఉన్నాడు. భూ ప్రకంపనలకు చుట్టుపక్కల ఉన్న కాంక్రీట్ నిర్మాణం కూలిపోయినప్పటికీ అతడి క్యాబిన్ మాత్రం చెక్కు చెదరలేదు. దీంతో దాదాపు 140 టన్నుల శిథిలాల కిందే చిక్కుకుపోయాడు. భవనం కూలిపోయినా క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో లోపల కొద్దిపాటి గాలి చేరి అతడు ప్రాణాలతో బయటపడగలిగాడు. దాదాపు ఎనిమిది రోజులుగా ఆహారం, నీళ్లు లేక నరకయాతన అనుభవించాడు. కోస్టారికా రెడ్‌క్రాస్ బృందం మొదట అతడి జాడ గుర్తించింది. టెలిస్కోప్ కెమెరాతో అతడితో సంప్రదింపులు జరిపింది.
100 గంటల ఆపరేషన్
కుప్పలు తెప్పలుగా పడి ఉన్న భవన శిథిలాలు, వరుస ప్రకంపనలు, భారీ వర్షం మధ్య దాదాపు 100 గంటలకుపైగా శ్రమించి రెస్క్యూ టీమ్ చివరికి ఫ్లోరెస్‌ను చేరుకుంది. అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆక్సిజన్ అందించింది. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించింది.
నా భార్యకు చెప్పకండి..
ఇక మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన తర్వాత "నేను బతికి ఉన్న విషయం ఇప్పుడే నా భార్యకు చెప్పకండి. ఒకవేళ నాకు ఏదైనా అయితే తను తట్టుకోలేదు" అంటూ ఫ్లోరెస్ చెప్పిన మాటలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
ఇది మిరాకిల్
సాధారణంగా విపత్తు సమయాల్లో 48 నుంచి 72 గంటల వ్యవధిని అత్యంత కీలమైందిగా భావిస్తారు. అంతకు మించితే ప్రాణాలతో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది ఎనిమిది రోజుల తర్వాత కూడా అతడు ప్రాణాలతో బయటపడటం మిరాకిల్ అనే చెప్పాలి.
2,595 మంది మృతి
ఈ జంట భూకంపాలు సృష్టించిన విధ్వంసానికి ఇప్పటి వరకూ 2,595 మంది బలయ్యారు. దాదాపు 50,000 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. వేలాది భవనాలు కూలిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలను నిరాశ్రయులయ్యారు.
Also Read..
రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్..? పోర్చుగల్ స్టార్ భవిష్యత్‌పై సోదరి కాటియా ఏమన్నదంటే..?
మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే.. ఎక్స్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
భారత్-పాక్ యుద్ధాన్ని అలా ఆపాను.. మళ్లీ పాతపాటే ఎత్తుకున్న ట్రంప్
తాజావార్తలు
- ●Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో
- ●Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
- ●ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? 'శక్తి' జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ
- ●Ponguleti | ఫాస్ట్‌ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి
- ●MP Dharmapuri Aravind | ఈడ ఉన్నయే బందయెటట్టున్నయంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్స్టిట్యూషన్లు తెస్తడట
- ●Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ - జానీ మాస్టర్‌తో కలిసి!

Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో

Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? 'శక్తి' జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ

Ponguleti | ఫాస్ట్‌ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి






