Alia Bhatt | అలియా భట్ స్పై యాక్షన్ సినిమాకు డిజాస్టర్ టాక్ – ధురంధర్ నే తిప్పి తీశారంటూ నెటిజన్ల కామెంట్లు
అలియా భట్ హీరోయిన్‌గా నటించిన స్పై యాక్షన్ మూవీ అల్ఫా నేడు (శుక్రవారం ) థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే ఈ సినిమాకు దారుణంగా నెగెటివ్ టాక్ వస్తోంది. ధురంధర్ సినిమాను తిప్పి తీశారని, అల్ఫా రోల్‌కు అలియాభట్ అస్సలు సెట్ కాలేదంటూ కామెంట్లు పెడుతోన్నారు.
Entertainment | Published On Jul 3, 2026, 2.03 pm IST
Alia Bhatt | అలియా భట్ హీరోయిన్‌గా నటించిన అల్ఫా మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా అల్ఫా రూపొందింది. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో శార్వరీ మరో నాయికగా కనిపించింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు.
భారత ఆర్మీని కించపరిచేలా...
బాలీవుడ్‌లో భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమాకు ఊహించని టాక్ వస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లోనే వరస్ట్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. ధురంధర్ లో భారత స్పైగా హీరో పాకిస్థాన్‌లో పనిచేస్తుంటాడు. అల్ఫాలో పాకిస్థాన్ స్పై భారత ఆర్మీలో ఇరవై ఏళ్లుగా ఉన్నతాధికారిగా పనిచేస్తూ దేశరహస్యాలను శత్రువులకు చేరవేస్తాడంటూ చూపించారు. ధురంధర్‌నే తిప్పి అల్ఫాగా తీశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం భారత ఆర్మీ, ఇంటెలిజెన్స్ వర్గాలను డీగ్రేడ్ చేసేలా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయంటూ ఫైర్ అవుతున్నారు.
రాంగ్ ఛాయిస్...
అలియా భట్ బెస్ట్ యాక్టర్ కానీ యాక్షన్ రోల్స్‌కు మాత్రం ఆమె సెట్ కాదని అల్ఫా సినిమా నిరూపించిందని అంటున్నారు. అల్ఫా పాత్రకు అలియా ఎంపికనే రాంగ్ ఛాయిస్ అంటూ ట్వీట్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. విలన్ల ముందు చిన్న పిల్లలా అలియా కనిపించిందని, సిక్స్ ప్యాక్ వారిని సింగిల్ పంచ్‌లతో పడకొట్టడం కామెడీగా ఉందంటూ నెటిజన్లు పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. శార్వరీ మేకప్‌పై పెట్టిన శ్రద్ధ యాక్టింగ్‌పై పెట్టలేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
హృతిక్ గెస్ట్ రోల్...
రిలీజ్‌కు ముందు అల్ఫా మరో ధురంధర్ అవుతుందంటూ నెటిజన్లు కంపేర్ చేశారు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. రెండింటికి అసలు పోలికే లేదని, దేశభక్తి అనే అంశాన్ని ఫన్నీగా ఆల్ఫాలో చూపించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్ఫాతో స్పై యూనివర్స్ జానర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆపేస్తే మంచిదని అంటున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి సీనియర్ యాక్టర్లు సైతం తేలిపోయారని అంటున్నారు. అల్ఫా సినిమా మొత్తానికి హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ ఒక్కటే బిగ్గెస్ట్ రిలీఫ్ అని కామెంట్లు పెడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
ఆగస్టు 24, 2026

Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ – నలుగురు హీరోయిన్లు – నాలుగు కథలు
ఆగస్టు 24, 2026

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ – బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!
- ●Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనం..!

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్‌లో అందుబాటులోకి అంతర్జాతీయ న్యాయ నిపుణులు

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్



