LPG Tanker Explodes | డివైడర్‌ను ఢీకొట్టిన ఎల్‌పీజీ ట్యాంకర్.. గ్యాస్ లీకై భారీ పేలుడు.. ఐదుగురు మృతి.. షాకింగ్ వీడియో
LPG Tanker Explodes | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ షిహోరి టోల్‌ప్లాజా (Sihori Toll Plaza) ఫుట్‌పాత్ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
LPG Tanker Explodes | ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ టోల్ ప్లాజా (UP Toll Booth) ఫుట్‌పాత్ డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో పెద్ద ఎత్తున గ్యాస్ లీకై.. అనంతరం భారీ పేలుడు సంభవించింది (LPG Tanker Explodes). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గత నెల 26న ఉదయం 6:40 గంటల సమయంలో కౌశాంబి (Kaushambi)లోని షిహోరి టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో ఓ ట్యాంకర్ కాన్పూర్ నుంచి ప్రతాప్‌గఢ్ వైపు వెళ్తోంది. షిహోరి టోల్‌ప్లాజా (Sihori Toll Plaza) వద్దకు రాగానే ముందు వెళ్తున్న మరో ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ట్యాంకర్ నియంత్రణకోల్పోయి టోల్ ప్లాజా ఫుట్‌పాత్ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఆ వెంటనే ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున లిక్విఫైడ్ గ్యాస్ లీకైంది. అప్రమత్తమైన టోల్‌ప్లాజా సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఆ కాసేపటికే అక్కడ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. టోల్‌ప్లాజా, పక్కన ఉన్న బిల్డింగ్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు.
మృతులు 40 ఏళ్ల ధర్మేంద్ర దూబే (ట్యాంకర్ డ్రైవర్ ), టోల్ ప్లాజా సిబ్బంది ఆలోక్ సింగ్, అనిల్ కుమార్, హీరామణి సింగ్, కృష్ణపాల్ మౌర్యగా గుర్తించారు. ఈ ప్రమాదం కారణంగా టోల్ ప్లాజా సమీపంలో పార్క్ చేసి ఉన్న 16 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు కూడా కాలిబూడిదయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
An #LPG Tanker caught #fire 🔥, after Hitting the Divider, near Sihori Toll Plaza, in #Kokhraj police station limits, in Uttar Pradesh's #Kaushambi district, Horrifying incident caught in CCTV.
At least 4 people were killed and 2 others were injured after the #LPGTanker… pic.twitter.com/ivXyVcdnwe
— Surya Reddy (@jsuryareddy) July 3, 2026
Also Read..
మిరాకిల్.. 8 రోజులుగా 140 టన్నుల శిథిలాల కిందే.. 100 గంటల ఆపరేషన్ తర్వాత సజీవంగా బయటకు
ఘట్‌కేసర్‌లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు
తాజావార్తలు
- ●DMK MLA | సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
- ●Harish Rao | వ్యాట్సప్‌లో ప్రూఫ్స్ పంపుతున్నా.. చీము నెత్తురుంటే రాజీనామా చెయ్
- ●Lithium Ion Battery Apps | లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..
- ●Alia Bhatt | అలియా భట్ స్పై యాక్షన్ సినిమాకు డిజాస్టర్ టాక్ - ధురంధర్ నే తిప్పి తీశారంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Couple dies by suicide | ఘట్‌కేసర్‌లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
- ●Heavy Rain | తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

DMK MLA | సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

Harish Rao | వ్యాట్సప్‌లో ప్రూఫ్స్ పంపుతున్నా.. చీము నెత్తురుంటే రాజీనామా చెయ్

Lithium Ion Battery Apps | లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..

Alia Bhatt | అలియా భట్ స్పై యాక్షన్ సినిమాకు డిజాస్టర్ టాక్ - ధురంధర్ నే తిప్పి తీశారంటూ నెటిజన్ల కామెంట్లు



