Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Kerala Film Festival | కేరళలో జరగనున్న 18వ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐడీఎస్‌ఎఫ్‌ఎఫ్‌కే)కు ముందే వివాదం తెరపైకి వచ్చింది. ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు ఎంపికైన 31 చిత్రాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది.
Kerala Film Festival | కేరళలో జరగనున్న 18వ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐడీఎస్‌ఎఫ్‌ఎఫ్‌కే)కు ముందే వివాదం తెరపైకి వచ్చింది. ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు ఎంపికైన 31 చిత్రాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. ఏ ఒక్క సినిమాకూ ప్రదర్శన అనుమతి నిరాకరించలేదని స్పష్టం చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు చిత్రాలకు సంబంధించి మరింత విపులమైన సారాంశం (డీటెయిల్డ్ సినాప్సిస్) సమర్పించాలని కోరింది. మిగిలిన చిత్రాల అంశాలను బట్టి సాధారణ మినహాయింపు ప్రక్రియలో భాగంగా సంబంధిత విభాగాల అధికారుల పరిశీలనకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది. ఫెస్టివల్‌లో ప్రదర్శించబోయే ఏ చిత్రానికీ అనుమతి నిరాకరించలేదని వెల్లడించింది. కొన్ని సినిమాలను వాటి ఇతివృత్తం ఆధారంగా సంబంధిత అధికారుల పరిశీలనకు పంపినట్లు తెలిపింది.
శశిథరూర్ ఏమన్నారు?
31 సినిమాల ప్రదర్శనకు అనుమతులు నిలిపివేశారన్న వార్తలపై శశిథరూర్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం భావ ప్రకటనా స్వేచ్ఛకు, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టకు సంబంధించినదని పేర్కొంటూ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఈ వ్యవహారంపై తన వైఖరిని స్పష్టం చేసింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు 18వ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫెస్టివల్ ప్రారంభానికి ముందు చిత్రాల ప్రదర్శన అనుమతుల అంశం చర్చనీయాంశంగా మారగా.. కేంద్రం తాజా ప్రకటనతో స్పష్టత ఇచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
- ●Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
- ●BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్..
- ●High Court issues Notices | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?

Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం





