Red Fort | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం.. ఎర్రకోటను పేల్చేస్తామంటూ కాల్
Red Fort | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort)కు బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. గుర్తుతెలియని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ (Mumbai Police Control Room)కు ఫోన్ చేసి ఎర్రకోటను పేల్చేస్తామని బెదిరించాడు.
Red Fort | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort)కు బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. గుర్తుతెలియని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ (Mumbai Police Control Room)కు ఫోన్ చేసి ఎర్రకోటను పేల్చేస్తామని బెదిరించాడు. ఈ బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన ముంబై అధికారులు వెంటనే ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ (Delhi Police Control Room)ను అప్రమత్తం చేశారు. వెంటనే అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు ఎర్రకోట వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ బెదిరింపు ఓ బూటకమని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.
కాగా, గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఓ కారులో పేలుడు సంభవించి దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు సమయంలో ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో గల అల్ ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న కశ్మీరీ వైద్యుడు ఉమర్ ఉన్ నబీ కారు నడుపుతున్నాడు. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా ఇతర పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో.. తీవ్ర ఆందోళనకు గురైన ఉమర్ ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో పలువురు వైద్యులను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరందరికీ అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అన్సార్ గజ్వాతుల్ హింద్'కు చెందిన వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పేలుడు జరిగిన ఎనిమిది నెలల తర్వాత మళ్లీ ఎర్రకోటకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
రూ.25వేల ఎస్ఐపీలో అసలు మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ






