India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
India-New Zealand | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల (India-New Zealand) మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. 2030 నాటికి వస్తువులు, సేవల రంగాల్లో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు రూ.35 వేల కోట్లకు పెంచాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి.
India-New Zealand | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలి న్యూజిలాండ్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భారత్, న్యూజిలాండ్ (India-New Zealand) మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. రాబోయే నాలుగేళ్ల కోసం ఇరు దేశాలు ఓ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించాయి. 2030 నాటికి వస్తువులు, సేవల రంగాల్లో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు రూ.35 వేల కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాయి.
దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆక్లాండ్ (Auckland)లో ప్రధాని మోదీ ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్‌తో మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. 10 ఒప్పందాలతో సహా మొత్తం 18 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చర్చల అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
రాబోయే 15 ఏళ్ల పాటు భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ హామీ ఇచ్చింది. అదేవిధంగా ఇటీవలే కుదిరిన భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలుకు వేగం తీసుకురావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని ప్రధానులు అంగీకరించారు. వాణిజ్యం, వ్యవసాయం, భద్రత, ఇన్నోవేషన్, పర్యాటకం, విద్య, సాంకేతికత, సేవలు ఇలా ప్రతీ రంగంలోనూ సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
ఇండో పసిఫిక్ సంబంధాలపై కూడా ఇరు దేశ ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. ఇండో-పసిఫిక్‌లో పెరుగుతున్న వ్యూహాత్మక సవాళ్ల దృష్ట్యా సముద్ర భద్రత రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఏర్పాటు చేయాలని అంగీకరించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సముద్ర మార్గాలను వినియోగించుకోవాలని కూడా తమ ఒప్పందంలో రాసుకున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ ఒక గమ్యస్థానమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ దేశం ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్‌గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగవేదిక అని అభివర్ణించారు.
Also Read..
పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
ఢిల్లీ ఎర్రకోటను పేల్చేస్తామంటూ బెదిరింపులు
ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?
సంబంధిత వార్తలు

Instagram Engagement | జెన్‌జీ నిరసనల తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్మెంట్.. 289.9% వృద్ధి
ఆగస్టు 26, 2026

Bihar protests | ప్రధాని మోదీ రాజీనామా చేయాలనే పోస్టర్ పట్టుకున్నాడని.. పాట్నాలో ఆరేండ్ల బాలుడి అరెస్ట్..! వీడియో
ఆగస్టు 26, 2026

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ



