Lenin Collections | లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్ – అఖిల్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ – పదకొండేళ్ల రికార్డ్ బ్రేక్
లెనిన్ మూవీ అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తొలి రోజు ఈ మూవీ 16.7 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Jul 11, 2026, 12.11 pm IST
Lenin Collections | అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తొలి రోజు లెనిన్‌కు 16 .7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
పదకొండేళ్ల తర్వాత...
2015లో రిలీజైన అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ రిలీజ్ రోజు 13. 86 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నది. ఆ తర్వాత విడుదలైన అక్కినేని హీరో సినిమాలన్నీ ఇంతకంటే తక్కువే కలెక్షన్స్ దక్కించుకున్నాయి. పదకొండేళ్ల తర్వాత అఖిల్ సినిమా కలెక్షన్స్ రికార్డును లెనిన్ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు, ఓవర్‌సీస్‌లో మూడు కోట్ల వరకు ఈ సినిమాకు వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నైజాంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది.
ప్రస్తుతం లెనిన్ మూవీ బుక్‌మై షోతో పాటు ఇతర ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బుక్ మై షోలో గంటకు 12 వేలకుపైగా టికెట్లు సేల్ అవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్...
లెనిన్ మూవీకి మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
అఖిల్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ....
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, రివేంజ్ యాక్షన్ అంశాలతో లెనిన్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు. తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతికి లెనిన్ ఎలా దూరమయ్యాడు? స్నేహితుడు వసంత్ చేసిన మోసంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. అఖిల్ యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సేతో అతడి కెమిస్ట్రీ, యాక్షన్ అంశాలతో పాటు చిత్తూరు బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. రొటీన్ స్టోరీ మైనస్‌గా మారిందంటూ విమర్శలు వస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TRAI | 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..
- ●Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు
- ●Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత
- ●India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
- ●ISKCON vs Puri Temple | ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?
- ●Wedding Fight | విందులో మటన్ కోసం కుర్చీలు, కర్రలు విరిగాయ్..

TRAI | 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..

Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు

Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత

India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్






