Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు
Donald Trump | టెహ్రాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను హత్య చేసేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తే.. ఆ దేశంపై దాడి చేసేందుకు 1,000 క్షిపణులు (1,000 missiles) సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
International | Published On Jul 11, 2026, 12.19 pm IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ దాడులు ఏమాత్రం ఆగడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హత్యకు ఇరాన్ ప్లాన్ చేసిందంటూ ఇజ్రాయెల్ హెచ్చరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌కు అమెరికా అధ్యక్షుడు తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను హత్య చేసేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తే.. ఆ దేశంపై దాడి చేసేందుకు 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
"ఒకవేళ ఇరాన్ (Iran) నన్ను హతమార్చేందకు, హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే.. ఆ దేశంపై భీకర దాడి తప్పదు. ఆ దేశంపై అత్యంత శక్తివంతమైన సైనిక దాడి చేయడానికి అమెరికా సైన్యానికి ముందస్తు అనుమతులు జారీ అయ్యాయి. ఇప్పటికే వెయ్యి క్షిపణులు లోడ్ చేసి పెట్టాం. అవి టెహ్రాన్‌పైకి దూసుకెళ్తాయి. టెహ్రాన్‌లోని అన్ని ప్రాంతాలను బూడిద చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది" అని ట్రంప్ ట్రూత్‌లో పోస్టు చేశారు.
అంతకుముందు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని వెల్లడించారు. తాను చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నానని తెలిపారు. ఒకవేళ తనకు ఏదైనా జరిగితే.. వారు ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో బాంబుల దాడిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అదే సమయంలో తనను హత్య చేయడానికి ఇరాన్ రహస్య కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు పెంటగాన్‌కు సమాచారం ఇచ్చినట్లు వస్తున్న నివేదికలను ట్రంప్ తోసిపుచ్చారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ తాను ఏమాత్రం భయపడటం లేదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read..
2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
తాజావార్తలు
- ●India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
- ●ISKCON vs Puri Temple | ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?
- ●Smart Phone | వర్షాకాలంలో ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన 15 జాగ్రత్తలు..
- ●Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
- ●Red Fort | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం.. ఎర్రకోటను పేల్చేస్తామంటూ కాల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..

India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్

ISKCON vs Puri Temple | ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?

Smart Phone | వర్షాకాలంలో ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన 15 జాగ్రత్తలు..

Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు






