Rajkumar | రాజ్‌కుమార్ రాక్షసక్రీడ.. మైనర్ బాలికపై హత్యాచారం..!
Rajkumar | పోక్సో కేసు (POCSO Case) పెట్టారని కక్ష కట్టాడు. జైలు నుంచి బయటకు వచ్చి పక్కా పథకం ప్రకారం తనపై కేసు పెట్టినవారిని, ఆ కారణంగా తనను పిల్లలకు దూరంగా ఉంచుతున్న భార్యను అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. బాధిత మైనర్ బాలికను ఇంట్లో నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి.. లైంగికదాడి చేశాడు. అనంతరం కసితీరా కత్తితో పొడిచి చంపేశాడు.
Rajkumar | త్రినేత్ర.న్యూస్: పోక్సో కేసు (POCSO Case) పెట్టారని కక్ష కట్టాడు. జైలు నుంచి బయటకు వచ్చి పక్కా పథకం ప్రకారం తనపై కేసు పెట్టినవారిని, ఆ కారణంగా తనను పిల్లలకు దూరంగా ఉంచుతున్న భార్యను అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. బాధిత మైనర్ బాలికను ఇంట్లో నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి.. లైంగికదాడి చేశాడు. అనంతరం కసితీరా కత్తితో పొడిచి చంపేశాడు. ఇదీ రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) మండల కేంద్రంలో రాజ్‌కుమార్ (Rajkumar) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి సాగించిన రాక్షసక్రీడ. దైవాలగూడ (Daivalaguda) సామూహిక హత్యలపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పార్వతి రాజ్‌కుమార్ కారులో బాధిత బాలిక (17) ఇంటికి ఓ కారులో చేరుకున్నాడు. బాలికను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని 3 కిలోమీటర్ల దూరంలోని గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. నేరుగా బాలిక ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్.. బాధితురాలి తల్లి, నానమ్మను కత్తితో పొడిచి చంపాడు. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లాడు.

పరుగెత్తినా.. పట్టుకుని మరీ..
పిల్లలను చూడాలని ఉందంటూ భార్య సరితకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె ఎలాంటి అనుమానం లేకుండా తలుపులు తీసినట్లు సమాచారం. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అయితే ప్రాణాలకు దక్కించుకునేందుకు బయటకు పరుగెత్తినప్పటికీ.. ఆమెను వెంబడించి పట్టుకుని మరీ హత్య చేసినట్లు తెలుస్తున్నది. అనంతరం ఇంట్లో ఉన్న తన మూడేండ్ల కుమార్తె, రెండేండ్ల కుమారుడిని గొంతులు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రలో ఉన్న చిన్నారులు.. అలాగే బెడ్ మీద రక్తపు మడుగులో కన్నుమూశారు. కాగా, సరితను ఏడేండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అయితే పోక్సో కేసు నేపథ్యంలో ఆమె రాజ్‌కుమార్‌ను దూరంగా పెట్టడంతోపాటు పిల్లల్ని దగ్గరకు రానివ్వకపోవడంతోనే చంపినట్లు తెలుస్తున్నది.
అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో రాజ్‌కుమార్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని కోసం గాలిస్తున్నారు.
ప్రేమ, పెండ్లి పేరుతో వేధింపులు
రాజ్‌కుమార్ ఏడేండ్ల క్రిత్రం.. సరితను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే దైవాలగూడకే చెందిన బాలికను ప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు శంషాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. కాలేజీకి వెళ్లే సమయంలోనూ రాజ్‌కుమార్ ఆమెను వెంబడించి.. కలవాలని, మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు. బెదిరింపులకు భయపడిన కుటుంబ సభ్యులు బాధితురాలిని కాలేజీకి పంపడం మానేశారు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువయ్యే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మే 16న పోక్సో కేసు నమోదు కాగా.. మే 26న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేసిన పోలీసులు.. కేవలం రూ.20,000 పూచీకత్తుతో బెయిల్ మీద బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాజ్‌కుమార్ కోసం గాలిస్తున్నాం: సీపీ తరుణ్ జోషి
హత్య అనంతరం నిందితుడు రాజ్ కుమార్ పరారైనట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిందితుడి కోసం 7 బృందాలు గాలిస్తున్నాయి. రాజ్ కుమార్ తన భార్య, పిల్లల్ని చంపడం దిగ్భ్రాంతికి గురిచేసింది. అర్ధరాత్రి షాబాద్ వెళ్లి బాలిక తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపాడు. బాలికను షాబాద్ నుంచి బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద బాలికను కూడా చంపేశాడు. పోక్సో కేసు నమోదు అయినప్పుడు నిందితుడు పరారీ అయ్యాడు. కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని విడుదల అయ్యాడని చెప్పారు.
బంధువుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
ఆరుగురి హత్య కేసులో మృతుల బంధువుల ఆందోళనకు దిగారు. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై బైఠాయించారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ను వెంటనే అరెస్టు చేయకపోతే, మరొకరి ప్రాణం తీస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల బంధువల ఆందోళనతో షాద్‌నగర్ - కంది రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Six people were Brutally Murdered in Daivalaguda, #Shabad mandal, #Rangareddy district, #Telangana
Enraged at being sent to jail under the
Protection of Children from Sexual Offences (#POCSO ) Act, the accused, 28-year-old Rajkumar, allegedly attacked and killed… pic.twitter.com/m63BtoYm6w— Surya Reddy (@jsuryareddy) July 11, 2026
సంబంధిత వార్తలు

POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
ఆగస్టు 9, 2026

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
జులై 26, 2026

Minister Azharuddin | దేశం గర్వపడేలా ఎదగండి.. ఆరుట్ల విద్యార్థులకు అజారుద్దీన్ సూచన
జులై 18, 2026
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ



