ISRO | బెంగళూరు ఇస్రో కార్యాలయానికి బాంబు బెదిరింపులు..!
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయంలో గురువారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వచ్చిన ఈమెయిల్ బెదిరింపుతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయంలో గురువారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వచ్చిన ఈమెయిల్ బెదిరింపుతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అయితే, తర్వాత జరిపిన తనిఖీల్లో అది నకిలీ బెదిరింపుగా తేలడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ కార్యాలయానికి ఈ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రాంగణాన్ని పరిశీలించాయి.
ముందుజాగ్రత్త చర్యగా కార్యాలయ పరిసరాలను ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంటల తరబడి సాగిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభ్యం కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడి ఆచూకీపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఇటీవలి కాలంలో దేశంలోని కీలక సంస్థలకు ఇలాంటి నకిలీ బెదిరింపులు తరచూ రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలోనూ ఎన్‌ఐఏ, డీఆర్‌డీఓ వంటి సంస్థలకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చిన కేసులో ఢిల్లీ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






