Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత
Kavitha | హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఆరుగురి హత్య జరిగిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతున్నదని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. ఫోక్సో కేసులో (POCSO Case) అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు 17 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపాడు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఆరుగురి హత్య జరిగిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతున్నదని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. ఫోక్సో కేసులో (POCSO Case) అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు 17 ఏండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపాడు. ఆ తర్వాత బాలిక తల్లి , నాన్నమ్మను కిరాతకంగా హత్య చేశాడని చెప్పారు. ఆ తర్వాత తన భార్య, పిల్లలను చంపేశాడని తెలిపారు. ఇన్ని హత్యలు చేస్తున్నా నిఘా వ్యవస్థ, పోలీసులు నిందితుడిని ఆపలేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి క్రూర నేర ప్రవృత్తి ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీస్ అధికారులు చెప్పడం సరికాదదని, వెంటనే అతడిని అరెస్ట్ చేసి, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుగురి హత్యలకు హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) మండలం కేంద్రంలో రాజ్‌కుమార్ (Rajkumar) అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. పోక్సో కేసు (POCSO Case) పెట్టారన్న కోపంతో బాధితురాలు, ఆమె తల్లి, నానమ్మను చంపిన (Murder) నిందితుడు.. అనంతరం తనను దూరంగా పెడుతున్నదనే కారణంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేశాడు. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలు గాలిస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sabitha Indra Reddy | చేవెళ్లలో ఉద్రిక్తత.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్ట్
- ●Meta | దుమారం రేపుతున్న మెటా మ్యూస్ ఏఐ.. యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు..
- ●Rega Kantharao | సీతారామ నుంచి సాగునీటి పరవళ్లు.. రేగా కాంతారావు హర్షం
- ●Snakes | పోలీస్ స్టేషన్లో నాగుపాము పిల్లలు.. బంధించిన సిబ్బంది.. వీడియో
- ●SIP | 2036 నాటికి రూ.1 కోటి లక్ష్యం.. నెలకు ఎంత SIP చేస్తే సాధ్యం?
- ●Harish Rao | కేసీఆర్ ఏం చేశారని అంటున్నారు.. వాళ్లకు ఈ నలుపు-తెలుపు అక్షరాలే బలమైన సమాధానం

Sabitha Indra Reddy | చేవెళ్లలో ఉద్రిక్తత.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్ట్

Meta | దుమారం రేపుతున్న మెటా మ్యూస్ ఏఐ.. యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు..

Rega Kantharao | సీతారామ నుంచి సాగునీటి పరవళ్లు.. రేగా కాంతారావు హర్షం

Snakes | పోలీస్ స్టేషన్లో నాగుపాము పిల్లలు.. బంధించిన సిబ్బంది.. వీడియో





