Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహనదారులపై కొరడా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 లక్షల ఫైన్ వసూలు
Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు (Delhi Pollution Curbs) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'వింటర్ యాక్షన్ ప్లాన్' (Winter Action Plan) తొలి రోజునే అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించారు. ఏకంగా రూ.68 లక్షల ఫైన్ వసూలు చేశారు.
Delhi Pollution Curbs | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు (Delhi Pollution Curbs) బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే 'వింటర్ యాక్షన్ ప్లాన్' (Winter Action Plan)ను నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. తొలిరోజే అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించారు. తొలిరోజే ఏకంగా రూ.68 లక్షల ఫైన్ వసూలు చేశారు.
వింటర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అధికారులు సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు దాదాపు 15,000 వాహనాలను తనిఖీ చేశారు. బీఎస్-6 (BS-VI) ప్రమాణాలు లేని నాన్-ఢిల్లీ వాహనాల ప్రవేశాలను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించి, ఢిల్లీలో ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 1,539 వాహనాలను సరిహద్దు నుంచే వెనక్కి పంపించేశారు.
వెనక్కి పంపిన వాటిలో 140 లైట్ మోటార్ వెహికల్స్ (LMVs), 54 లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCVs), 95 హెవీ గుడ్స్ వెహికల్స్ (HGVs), 34 బస్సులు ఉన్నాయి. బార్డర్ ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘన కింద ఆయా వాహనాల నుంచి రూ.2 లక్షల ఫైన్ వసూలు చేశారు. మరోవైపు తనిఖీల్లో భాగంగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీసీ) లేని 566 వాహనాలకు రూ.56.6 లక్షల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 127 చలాన్లు జారీ చేసి 62 వాహనాలను సీజ్ చేశారు. సీఎన్‌జీ (CNG), ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపునిచ్చారు. మొత్తం 740 వాహనాలను పరిశీలించి నగరంలోకి అనుమతించారు.
మరోవైపు, నిర్మాణ పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్యంపై కూడా అధికారులు దృష్టి సారించారు. మొత్తం 300 నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేయగా.. 32 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. వీరికి పర్యావరణ నష్టపరిహారం కింద రూ.9.8 లక్షలు విధించారు. కొన్ని నిర్మాణాలకు మూసివేత ఆదేశాలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also Read..
దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్..
వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టింక్ట్‌పై వివాదం.. యూజర్ ఖాతా బ్యాన్..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..
- ●TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..
- ●Hackers hijacked digital billboards | బిల్ బోర్డులపై హ్యాకర్ల దాడి.. అశ్లీల వీడియోల ప్రసారం
- ●Thummala Nageshwar Rao | మార్కెట్లలో ఏఐని మనమే మొదలు తీసుకొద్దాం
- ●NHAI Free Flow Tolling | ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగక్కర్లేదు.. హైస్పీడ్లోనే టోల్ కట్
- ●Dia Mirza | దియా మీర్జా దీపావళి యాడ్‌పై బీజేపీ నేతల అభ్యంతరం - డిలీట్ చేసిన బీఎంసీ

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..

TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..

Hackers hijacked digital billboards | బిల్ బోర్డులపై హ్యాకర్ల దాడి.. అశ్లీల వీడియోల ప్రసారం

Thummala Nageshwar Rao | మార్కెట్లలో ఏఐని మనమే మొదలు తీసుకొద్దాం






