త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

Supreme Court | దీపావళి వేళ టపాసులను కాల్చేందుకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అనుమ‌తులు ఇచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో నవంబర్ 7, 8 తేదీల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చాల‌ని, ఉద‌యం సాయంత్రం వేళ‌ల్లో మాత్రమే టపాసులు పేల్చాలని స్పష్టం చేసింది.

P

National | Published On Nov 2, 2026, 3.37 pm IST

Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..
Advertisement
  • దీపావ‌ళికి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రెండురోజులే ఛాన్స్‌
  • 7, 8 తేదీల్లో టపాసులు కాల్చేందుకు అనుమ‌తి ఇచ్చిన కోర్టు
  • నిర్దిష్ట స‌మ‌యంలోనే కాల్చాల‌ని ఆదేశాలు

Supreme Court | దీపావళి వేళ టపాసులను కాల్చేందుకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అనుమ‌తులు ఇచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో నవంబర్ 7, 8 తేదీల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చాల‌ని, ఉద‌యం సాయంత్రం వేళ‌ల్లో మాత్రమే టపాసులు పేల్చాలని స్పష్టం చేసింది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. టపాసులపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఆదేశాలు జారీ చేయడం మాత్రమే సరిపోదని, క్షేత్రస్థాయిలో వాటి అమలు కూడా అంతే కీలకమని గత విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.

ఆదేశాలు అమలు కాకపోతే ప్రయోజనం లేదు

‘ప్రతి జీవికి సంబంధించిన అంశమిది. ఆదేశాలు జారీ చేసి, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయకపోతే ప్రయోజనం ఏముంటుంది? అలా అయితే కోర్టు ఆదేశాలు అపహాస్యం పాలవుతాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి సూచించింది. ప్రజల భావోద్వేగాలను కూడా తాము అర్థం చేసుకుంటున్నామని, అందుకే పూర్తిస్థాయి నిషేధం విధించడం లేదని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

అవగాహనకు క‌ల్పించేందుకు..

గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని వర్గాలు సహకరించాలని సుప్రీంకోర్టు కోరింది. టపాసుల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించేందుకు క్రీడాకారులు సహా ప్రముఖుల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించింది. ఆంక్షల అమలుతో పాటు ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందితేనే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

ట్యాగ్స్:

Delhi Air PollutionDelhi Air QualityDelhi NCRDiwali 2026Diwali CrackersFirecracker BanFirecrackersGreen CrackersNovember 7November 8Supreme CourtTelugu News
Advertisement
Advertisement