Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
Nitin Nabin | బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ఆయన దీపావాళి పండుగ తర్వాత కరీంనగర్‌కు రానున్నట్లు తెలుస్తున్నది.
Nitin Nabin | త్రినేత్ర న్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ఆయన దీపావాళి పండుగ తర్వాత కరీంనగర్‌కు రానున్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై కాంగ్రెస్ (Congress), కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తిప్పికొంటేందుకు బీజేపీ (BJP) కౌంటర్‌గా పాదయాత్రలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 5న నతిన్ నబిన్ కరీంనగర్‌లో (Karimnagar) పర్యటించాల్సి ఉంది. సర్ (SIR) ప్రక్రియకు మద్దతుగా పట్టణంలోని ఆర్యవైశ్య భవన్, టవర్ సర్కిల్, శాస్ట్రి రోడ్ మీదుగా కమాన్ వరకు నిర్వహించే మహా పాదయాత్ర (Maha Padayatra)లో ఆయన పాల్గొంటారని కేంద్ర మంత్రి ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చిందేందుకు కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్, పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో బండి సంజయ్ (Bandi Sanjay) ఆదివారం సమావేశమయ్యారు. పాదయాత్రకు సుమారు 50 వేల మందిని తరలించారని నిర్ణయించారు. అయితే తాజాగా నితిన్ నబిన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తున్నది. ఆయన దీపావళి తర్వాత నగరానికి రానున్నట్లు పార్టీ వర్గాలు వెళ్లడించాయి.
కాగా, సర్‌పై కాంగ్రెస్, సీజేపీ ప్రచారాన్ని తిప్పికొంట్టేందుకు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, కరీంనగర్‌లో ర్యాలీలు నిర్వహిస్తున్నది. సోమవారం (నవంబర్ 2న) హైదరాబాద్‌లో జరుగనున్న ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొంటున్నారు. నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబూ జగ్‌జీవన్ రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇక కరీంనగర్‌లో నిర్వహించనున్న ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొననున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad | మద్యం మత్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి
నవంబర్ 2, 2026

Army Recruitment Rally | ఈనెల 13 నుంచి 24 వరకు.. గచ్చిబౌలిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నవంబర్ 2, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Instinct AI | వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టింక్ట్‌పై వివాదం.. యూజర్ ఖాతా బ్యాన్..
- ●EPFO | ఇక ఈపీఎఫ్ సేవలు వాట్సాప్‌లోనే.. రూ.5 కోట్ల పీఎఫ్ నగదుకు మోక్షం..
- ●Hyderabad | మద్యం మత్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి
- ●Army Recruitment Rally | ఈనెల 13 నుంచి 24 వరకు.. గచ్చిబౌలిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- ●Stock Markets | దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్..
- ●Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ వాల్ట్ గురించి తెలుసుకోండి!

Instinct AI | వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టింక్ట్‌పై వివాదం.. యూజర్ ఖాతా బ్యాన్..

EPFO | ఇక ఈపీఎఫ్ సేవలు వాట్సాప్‌లోనే.. రూ.5 కోట్ల పీఎఫ్ నగదుకు మోక్షం..

Hyderabad | మద్యం మత్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి

Army Recruitment Rally | ఈనెల 13 నుంచి 24 వరకు.. గచ్చిబౌలిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ



