TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవీకాలం ఇటీవల ముగిసింది. దీంతో దేవస్థానం వ్యవహారాలు ఎక్కడా నిలిచిపోకుండా ఏపీ ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 658 జారీ చేసింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను అథారిటీ చైర్మన్‌గా నియమించగా.. ఆర్థిక శాఖ కార్యదర్శి వీ వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కే కన్నబాబును సభ్యులుగా నియమించింది.
Devotional | Published On Nov 2, 2026, 5.27 pm IST
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవీకాలం ఇటీవల ముగిసింది. దీంతో దేవస్థానం వ్యవహారాలు ఎక్కడా నిలిచిపోకుండా ఏపీ ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 658 జారీ చేసింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను అథారిటీ చైర్మన్‌గా నియమించగా.. ఆర్థిక శాఖ కార్యదర్శి వీ వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కే కన్నబాబును సభ్యులుగా నియమించింది. కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యే వరకు, గరిష్టంగా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది.
ముగ్గురు ఐఏఎస్‌లకు బాధ్యతలు
టీటీడీ పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈవో ముద్దాడ రవిచంద్ర నేతృత్వంలో ఆర్థిక, దేవదాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ధర్మకర్తల మండలికి ఉండే అధికారాలు, విధులన్నింటినీ ఈ అథారిటీకి ప్రభుత్వం బదలాయించింది. దీంతో కొత్త బోర్డు కొలువుదీరే వరకు దేవస్థానం పాలన, ఆర్థిక వ్యవహారాలు, భక్తులకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ అథారిటీ పరిధిలో కొనసాగనున్నాయి.
ఎన్నికల కోడ్‌తో కొత్త బోర్డుకు బ్రేక్
టీటీడీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం అక్టోబర్ 31తో ముగిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 నవంబర్ 1న బీఆర్ నాయుడిని చైర్మన్‌గా, మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే నెల 6న బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. దేవదాయ చట్టం ప్రకారం రెండేళ్ల పదవీకాలం ఉండటంతో ఈ ఏడాది అక్టోబర్ 31తో ప్రస్తుత బోర్డు గడువు పూర్తయింది. సాధారణంగా బోర్డు పదవీకాలం ముగియగానే కొత్త పాలకమండలిని నియమించడం ఆనవాయితీ. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొత్త బోర్డు నియామకానికి బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పాలనలో ఎలాంటి శూన్యత ఏర్పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది.
భక్తుల సేవలకు ఆటంకం లేకుండా..
తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనాలు, వసతి, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, ఇతర సౌకర్యాలతో పాటు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణకు నిరంతర పరిపాలనా పర్యవేక్షణ అవసరం. ముఖ్యంగా రథసప్తమి వంటి ప్రధాన పర్వదినాల ఏర్పాట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం కీలకం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాత్కాలిక పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత బోర్డు పదవీకాలం ముగిసిన నేపథ్యంలో చైర్మన్ కార్యాలయ కార్యకలాపాలు, చైర్మన్, సభ్యుల సిఫారసు లేఖల ఆధారంగా దర్శనాల కేటాయింపులు నిలిచిపోనున్నాయనే చర్చ సాగింది. తాజాగా స్పెసిఫైడ్ అథారిటీ నియామకంతో టీటీడీ అధికారిక పరిపాలనకు అవసరమైన వ్యవస్థ కొనసాగనుంది.
కొత్త బోర్డుపై ఆసక్తి
స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు తాత్కాలిక పరిష్కారమే కావడంతో తదుపరి ధర్మకర్తల మండలి నియామకంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల కోడ్ ముగిసి, పరిస్థితులు అనుకూలించిన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు శ్రీవారి ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, దేవస్థానం పరిపాలనకు సంబంధించిన బాధ్యతలను స్పెసిఫైడ్ అథారిటీ నిర్వర్తించనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..
- ●Hackers hijacked digital billboards | బిల్ బోర్డులపై హ్యాకర్ల దాడి.. అశ్లీల వీడియోల ప్రసారం
- ●Thummala Nageshwar Rao | మార్కెట్లలో ఏఐని మనమే మొదలు తీసుకొద్దాం
- ●NHAI Free Flow Tolling | ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగక్కర్లేదు.. హైస్పీడ్లోనే టోల్ కట్
- ●Dia Mirza | దియా మీర్జా దీపావళి యాడ్‌పై బీజేపీ నేతల అభ్యంతరం - డిలీట్ చేసిన బీఎంసీ
- ●85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..

Hackers hijacked digital billboards | బిల్ బోర్డులపై హ్యాకర్ల దాడి.. అశ్లీల వీడియోల ప్రసారం

Thummala Nageshwar Rao | మార్కెట్లలో ఏఐని మనమే మొదలు తీసుకొద్దాం

NHAI Free Flow Tolling | ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగక్కర్లేదు.. హైస్పీడ్లోనే టోల్ కట్






