త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు..

ICICI Bank | ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన కాలపరిమితులకు వడ్డీ రేట్లను పెంచింది. దీర్ఘకాలిక డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. తాజా సవరణతో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.20 శాతం, సాధారణ ఖాతాదారులు గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ పొందవచ్చు.

S

Business | Published On Nov 2, 2026, 5.27 pm IST

ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు..
Advertisement

ICICI Bank | ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంపిక చేసిన కాలపరిమితులకు వడ్డీ రేట్లను పెంచింది. దీర్ఘకాలిక డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పెంచింది. తాజా సవరణతో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.20 శాతం, సాధారణ ఖాతాదారులు గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ పొందవచ్చు.

ఎంత పెంచింది..?

ఐసీఐసీఐ బ్యాంక్ ఎంపిక చేసిన దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. సాధారణ ఖాతాదారులకు రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 6.45 శాతం నుంచి 6.55 శాతానికి పెంచింది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు, ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీని 6.50 శాతం నుంచి 6.60 శాతానికి పెంచింది. ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీపై కూడా వడ్డీని 6.50 శాతం నుంచి 6.60 శాతానికి సవరించింది. స్వల్పకాలిక డిపాజిట్లపై 7 నుంచి 45 రోజులకు 2.75 శాతం, 46 నుంచి 90 రోజులకు 4 శాతం, 91 నుంచి 184 రోజులకు 4.50 శాతం వడ్డీ అందిస్తోంది. 185 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లకు 5.50 శాతం, ఏడాది నుంచి 18 నెలలలోపు డిపాజిట్లకు 6.25 శాతం, 18 నెలల నుంచి రెండేళ్ల వరకు 6.30 శాతం వడ్డీ ఇస్తోంది.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎంతంటే..?

సీనియర్ సిటిజన్లకు కూడా బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీని 6.95 శాతం నుంచి 7.05 శాతానికి పెంచగా, మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెంచింది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీని 7 శాతం నుంచి 7.10 శాతానికి సవరించింది. ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీపై కూడా 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెంచింది. స్వల్పకాలిక డిపాజిట్లపై 7 నుంచి 45 రోజులకు 3.25 శాతం, 46 నుంచి 90 రోజులకు 4.50 శాతం, 91 నుంచి 184 రోజులకు 5 శాతం, 185 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది నుంచి 18 నెలలలోపు డిపాజిట్లకు 6.75 శాతం, 18 నెలల నుంచి రెండేళ్ల వరకు 6.80 శాతం వడ్డీ అందిస్తోంది.

ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే ముందు ఏం పరిశీలించాలి?

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించే ముందు వివిధ కాలపరిమితులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను పోల్చి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఎఫ్‌డీకి, ప్రత్యేక కాలపరిమితి డిపాజిట్ పథకానికి వడ్డీ రేట్లలో తేడా ఉంటుందా అనేది పరిశీలించాలి. మధ్యలోనే డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే విధించే జరిమానాలు, వడ్డీ చెల్లింపు విధానాలు, వర్తించే పన్ను నిబంధనలను కూడా తెలుసుకోవాలి. ఖాతాదారుల వర్గం, డిపాజిట్ కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వడ్డీ రేట్లు, నిబంధనలను పరిశీలించడం మంచిది.

ట్యాగ్స్:

FD Interest RatesFixed DepositIcici BankICICI Bank FD RatesSenior Citizens FD
Advertisement
Advertisement