Thummala Nageshwar Rao | మార్కెట్లలో ఏఐని మనమే మొదలు తీసుకొద్దాం
Thummala Nageshwar Rao | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ మార్కెట్ యార్డ్ (Digital Market Yard) వ్యవస్థను దేశంలోనే తొలిసారి తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) అధికారులను ఆదేశించారు.
- డిజిటల్ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసుకుందాం
- అక్రమాలు జరగకుండా చూడొచ్చు
- వారం రోజుల్లో టెండర్లు పిలవండి
- కోహెడ మార్కెట్ నిర్మాణంలో మార్చి నాటికి తొలి దశ పూర్తి చేయండి
- మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశం
Thummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ మార్కెట్ యార్డ్ (Digital Market Yard) వ్యవస్థను దేశంలోనే తొలిసారి తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) అధికారులను ఆదేశించారు. రైతుల పంటకు సరైన ధర, మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోహెడ మార్కెట్ నిర్మాణంలో వచ్చే మార్చి నాటికి తొలి దశ పూర్తి చేయాలన్నారు.
రైతు మార్కెట్ యార్డులోకి ప్రవేశించినప్పటి నుంచి పంట విక్రయించి, చెల్లింపులు పొంది, మార్కెట్ నుంచి బయటకు వెళ్లే వరకు ప్రతి దశను ఒకే డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రైతు వివరాల నమోదు, ప్రతి పంట లాట్‌కు ప్రత్యేక ఐడీ కేటాయింపు, డిజిటల్ బిడ్డింగ్ లేదా టెండర్ నమోదు, పంట నాణ్యత పరీక్ష (అసేయింగ్), ఆన్‌లైన్ వేలం, ధర నిర్ణయం, రైతు అంగీకారం, పంట తూకం, అమ్మకపు బిల్లుల తయారీ, మార్కెట్ ఛార్జీల లెక్కింపు, రైతులకు చెల్లింపులు, గేట్ ఎగ్జిట్ నమోదు, ఈ-రసీదులు, ఈ-పర్మిట్ల జారీ వరకు అన్ని ప్రక్రియలు ఒకే వేదికపై నిర్వహించేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
రైతు మార్కెట్ యార్డుకు రాగానే అతని వివరాలు నమోదు చేసి, పంటకు ప్రత్యేకమైన లాట్ ఐడీ కేటాయిస్తారు. అనంతరం పంట నాణ్యతను పరీక్షించి సంబంధిత వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తారు. వ్యాపారులు ఆన్‌లైన్‌లో లాట్ వివరాలను పరిశీలించి తమ బిడ్లను నమోదు చేస్తారు. వేలం లేదా టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణయించిన ధరను వ్యవస్థలో ప్రకటిస్తారు. కమిషన్ ఏజెంట్ ద్వారా రైతుకు ఓటీపీ పంపించి, రైతు ధరను నిర్ధారించిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంట తూకం వేసి, నమోదైన బరువు, ఖరారైన ధర ఆధారంగా కమిషన్ ఏజెంట్ లేదా మార్కెట్ కమిటీ అమ్మకపు బిల్లును రూపొందిస్తుంది. మార్కెట్ ఛార్జీలు, రైతుకు చేసిన చెల్లింపుల వివరాలు నమోదు చేసి, అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం గేట్ ఎగ్జిట్ ద్వారా ఈ-రసీదులు, ఈ-పర్మిట్లు జారీ చేస్తారు.
మార్కెట్ యార్డుకు వచ్చిన పంట వివరాలు, ధరల ధోరణులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్ల కార్యకలాపాలు, వేలం వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) రూపొందించాలని మంత్రి సూచించారు. గతంలో జరిగిన వేలం, లావాదేవీల వివరాలను భద్రపరిచి, అవసరమైనప్పుడు విశ్లేషణలు, తనిఖీల కోసం తిరిగి పొందేలా చూడాలన్నారు. వివిధ దశల్లో నమోదయ్యే సమాచారం స్వయంచాలకంగా అనుసంధానమయ్యేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న డిజిటల్ మార్కెట్ వ్యవస్థలను అధ్యయనం చేసి, వాటికంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో ఆదర్శవంతమైన వ్యవస్థను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారుల హాజరు, బయోమెట్రిక్ అటెండెన్స్‌ను కూడా ఈ డిజిటల్ వ్యవస్థలో భాగంగా చేయాలని సూచించారు. ఐటీ శాఖతో సమన్వయం చేసుకొని, వారం రోజుల్లోగా టెండర్లు పిలిచే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
మార్కెట్ యార్డుల్లో డిజిటల్ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, గోదాముల నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. రైతులు, వ్యాపారులకు ఉపయోగపడేలా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో పంటలకు లభిస్తున్న ధరలను ప్రదర్శించాలన్నారు. అధికంగా వ్యాపార లావాదేవీలు జరిగే మార్కెట్ యార్డుల్లో తొలుత ఈ సదుపాయాలను ఏర్పాటు చేసి, క్రమంగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్లకు విస్తరించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకొని మాన్యువల్ జోక్యానికి అవకాశం లేకుండా, ప్రతి లావాదేవీకి జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సంస్థ ప్రతినిధులు సూచించిన భూమి చదును సవరణలపై ముఖ్యమంత్రి ఆమోదం తీసుకొని, వచ్చే వారం రోజుల్లోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేసి, మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో కూడిన సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టి, పనుల వేగాన్ని పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి
- ●Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..
- ●CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ
- ●Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి

Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..

CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ

Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!





