త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | మ‌ళ్లీ పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌లు.. ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్‌..

Gold And Silver Prices Today | ఖ‌తార్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌లు మ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌రుపుతుండ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం జోష్ మీదున్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 1 శాతానికి పైగా పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి. దీంతో బులియ‌న్ మార్కెట్ల‌లోనూ కొనుగోళ్ల జోరు క‌నిపిస్తోంది.

S

Business | Published On Nov 2, 2026, 11.33 am IST

Gold And Silver Prices Today | మ‌ళ్లీ పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌లు.. ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్‌..
Advertisement

Gold And Silver Prices Today | ఖ‌తార్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌లు మ‌ళ్లీ చ‌ర్చ‌లు జ‌రుపుతుండ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం జోష్ మీదున్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 1 శాతానికి పైగా పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి. దీంతో బులియ‌న్ మార్కెట్ల‌లోనూ కొనుగోళ్ల జోరు క‌నిపిస్తోంది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఈ సెష‌న్‌లో 0.95 శాతం మేర ఎగ‌బాకి 3,912 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 2.44 శాతం ఎగ‌సి 50 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 604 పాయింట్లు పెరిగి 1,39,113 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,132 పాయింట్లు పెరిగి 1,82,264 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఒక మోస్త‌రుగా పెరిగాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,937 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,11,496 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,39,370 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,93,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,7775 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,02,200గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,27,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,77,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,453 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.83,624గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,04,530 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,45,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,00,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,00,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,000 గా ఉంది.

ట్యాగ్స్:

GoldGold And Silver Prices TodayGold PricesGold RatesMetals
Advertisement
Advertisement