Hackers hijacked digital billboards | బిల్ బోర్డులపై హ్యాకర్ల దాడి.. అశ్లీల వీడియోల ప్రసారం
Hackers hijacked digital billboards | ఈజిప్ట్, మలేషియా, బ్రెజిల్, చైనా, ఇరాక్ వంటి దేశాల్లో డిజిటల్ బిల్ బోర్డులను హ్యాకర్లు హైజాక్ చేశారు (Hackers hijacked digital billboards). జనసమూహం అధికంగా ఉండే ప్రదేశాల్లోని బిల్ బోర్డ్స్‌పై సాధారణ ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలను ప్రసారం (pornographic videos) చేశారు. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. Leakers$ (Leakers$) అనే టెలిగ్రామ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది.
International | Published On Nov 2, 2026, 5.19 pm IST
Hackers hijacked digital billboards | త్రినేత్ర న్యూస్ : సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫెడెక్స్ (FedEx), డిజిటల్ అరెస్టులంటూ అమాయకులను మోసగిస్తూ రూ.లక్షలు దోచుకుంటున్న కేటుగాళ్లు.. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకటనల స్క్రీన్ల భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవలే పలు దేశాల్లో డిజిటల్ బిల్ బోర్డులను హ్యాకర్లు హైజాక్ చేశారు (Hackers hijacked digital billboards). జనసమూహం అధికంగా ఉండే ప్రదేశాల్లోని బిల్ బోర్డ్స్‌పై సాధారణ ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలను ప్రసారం (pornographic videos) చేయడం కలకలం రేపుతోంది.
ఈ తరహా ఘటనలు ఈజిప్ట్, మలేషియా, బ్రెజిల్ దేశాల్లో ఇప్పటికే వెలుగుచూడగా.. తాజాగా ఇరాక్, చైనాలో కూడా ఇలాంటి ఘటనే జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. గత వారం ఈజిప్టు రాజధాని కైరో నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై ఉన్న ఓ పెద్ద బిల్‌బోర్డుపై హ్యాకర్లు అశ్లీల దృశ్యాలను ప్రదర్శంచారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆ దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ బిల్‌బోర్డు ఓ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న అడ్వర్టైజింగ్ కంపెనీకి చెందినదని ఈజిప్ట్ హోం శాఖ తెలిపింది. అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరగడం వల్లే ఒకే సమయంలో పలు దేశాల్లో అనధికారిక ఫుటేజ్ ప్రసారమైనట్లు వెల్లడించింది. అయితే ఆ సంస్థ పేరును గానీ, ప్రభావితమైన దేశాల వివరాలను గానీ మంత్రిత్వ శాఖ పంచుకోలేదు.
ఇది ఎవరి పని..?
Leakers$ (Leakers$) అనే టెలిగ్రామ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది. LED స్క్రీన్లకు కంటెంట్‌ను పంపడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను తాము దుర్వినియోగం చేశామని ఆ బృందం తెలిపింది. ఇందుకోసం ఆటోమేటెడ్ స్కానింగ్ టూల్స్ ఉపయోగించి కేవలం రెండు గంటల్లోనే ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉన్న వేలాది బలహీనమైన సిస్టమ్‌లను గుర్తించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఇరాక్, చైనా దేశాల్లోని బిల్ బోర్డులను కూడా హ్యాక్ చేసినట్లు తెలిపారు. తగిన భద్రత లేని ప్రకటనల స్క్రీన్‌లను ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో ప్రపంచానికి నిరూపించేందుకే ఈ దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ హ్యాకింగ్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Also Read..
నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ
లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు
గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి
- ●Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..
- ●CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ
- ●Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి

Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..

CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ

Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!






