త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్య‌త‌.. ఆంక్ష‌లు అమ‌ల్లోకి

Delhi Pollution | ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Pollution) ప‌డ‌గ విప్పుతోంది. ప్ర‌స్తుతం రాజ‌ధాని ప్రాంతంలో గాలి నాణ్య‌త సూచిక 244కు పెరిగింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి (CAQM) న‌గ‌రంలో ఆంక్ష‌లు అమ‌ల్లోకి తెచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-1 నిబంధనలను తక్షణమే అమల్లోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

D

National | Published On Oct 21, 2026, 5.35 pm IST

Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్య‌త‌.. ఆంక్ష‌లు అమ‌ల్లోకి
Advertisement

Delhi Pollution | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్య‌త‌ (Delhi Pollution) క్షీణించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి (CAQM) న‌గ‌రంలో ఆంక్ష‌లు అమ‌ల్లోకి తెచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-1 నిబంధనలను తక్షణమే అమల్లోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

మంగ‌ళ‌వారం ఢిల్లీలో గాలి నాణ్య‌త సూచిక‌ 179గా ఉండ‌గా.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌ స‌మయానికి 244కు పెరిగిన‌ట్లు సీఏక్యూఎమ్ తెలిపింది. రాబోయే రోజుల్లో గాలి నాణ్య‌త మ‌రింత క్షీణించే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ (IMD), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటాలజీ (IITM) అంచనా వేసిన‌ట్లు పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే న‌గ‌రంలో గ్రాప్‌-1 నిబంధనలు అమ‌ల్లోకి తెచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రోడ్డు పక్కన ఉండే హోటళ్లు, ఓపెన్ ఈటరీలు, కమర్షియల్ కిచెన్లలో బొగ్గు (Coal), కట్టెల (Firewood) వాడకంపై పూర్తిగా నిషేధం విధించారు. డీజిల్ జనరేటర్ల వినియోగంపై కూడా ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి.

ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన‌ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని ఎన్‌సీఆర్ ప్రాంతాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సీఏక్యూఎం (CAQM) సబ్-కమిటీ గాలి నాణ్యతను, వాతావరణ అంచనాలను నిరంతరం గమనిస్తూ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, పౌరులంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. న‌గ‌రంలో కాలుష్య స్థాయిలు పెరిగేకొద్దీ మరింత కఠినమైన చర్యలు అమ‌లు చేయ‌నున్నారు.

Also Read..

ప్ర‌స్తుత సీట్ల‌లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయొచ్చు : ఖ‌ర్గే

ఫ్రాన్స్‌లో ఏం జ‌రుగుతోందో చూస్తున్నాం క‌దా..?

బజాజ్ పల్సర్ ఎన్250ఎస్ఎస్‌ విడుదల.. కొత్త ఫీచర్లు ఇవే..

Advertisement
Advertisement