Dia Mirza | దియా మీర్జా దీపావళి యాడ్‌పై బీజేపీ నేతల అభ్యంతరం – డిలీట్ చేసిన బీఎంసీ
బాలీవుడ్ నటి దియా మీర్జాపై ముంబై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యరహితంగా దీపావళికి జరుపుకోవాలంటూ దియామీర్జా పిలుపునిచ్చిన ఓ వీడియోను బీఎంసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హిందూ వ్యతిరేకి అయిన దియా మీర్జా తమకు పండుగను ఎలా జరుపుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
Entertainment | Published On Nov 2, 2026, 5.14 pm IST
Dia Mirza | వాయు, శబ్దకాలుష్యాలు లేకుండా పర్యావరణహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ఓ ప్రచారం వివాదాస్పదమైంది. ఈ యాడ్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంపై బీఎంసీ వీడియోను డిలీట్ చేసింది. కాలుష్యరహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలంటూ కొందరు సెలిబ్రిటీల ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించింది బీఎంసీ. స్పెషల్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోల్లో దియామీర్జాతో పాటు మాధురీదీక్షిత్, క్రికెటర్ అంజిక్య రహాణే, నిషిగంధ వాడ్ కనిపించారు.
ముంబై చీఫ్...
అయితే దియా మీర్జా వీడియోపై బీజేపీ ముంబై చీఫ్ అమిత్ సత్నామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపావళిని ఎలా జరుపుకోవాలో దియా మీర్జా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఈ పండుగ తమ సంస్కృతిలో భాగమని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. అమిత్ సత్నామ్ విమర్శలతో దియా మీర్జా వీడియోను బీఎంసీ సోషల్ మీడియా నుంచి తొలగించింది. అజింక్య రహానే, మాధురీ దీక్షిత్ పోస్ట్‌లను మాత్రం డిలీట్ చేయలేదు.
మోదీకి వ్యతిరేకంగా...
దియా మీర్జా వీడియోను బీఎంసీ డిలీట్ చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బాలీవుడ్ నటిపై బీజీపీ ఆగ్రహం వెనుక గతంలో ప్రధాని మోదీపై ఆమె చేసిన ఆరోపణలే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంపై ముంబై మేయర్ రీతూ తావ్డే స్పందించింది. ప్రధాని మోదీ ప్రతిపాదనలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చాలా సార్లు దియా మీర్జా వ్యాఖ్యలు చేసిందని మేయర్ అన్నది. "మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నర్మద ప్రాజెక్ట్‌తో పాటు యూనిఫామ్ సివిల్ కోడ్‌లపై దియా మీర్జా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీపావళిని ఎలా జరుపుకోవాలో మాకు తెలుసు. హిందుత్వ వ్యతిరేకి అయిన దియా మీర్జా చెప్పనవసరం లేదు" అని మేయర్ పేర్కొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి
- ●Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..
- ●CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ
- ●Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి

Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..

CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ

Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!






