Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య (Delhi Pollution) రహిత దీపావళిని జరుపుకునేలా (pollution free Diwali) ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సేవలను ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య (Delhi Pollution) రహిత దీపావళిని జరుపుకునేలా (pollution free Diwali) ప్రజలకు అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఇందుకోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని పబ్లిక్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌కు లీడర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో బాణసంచా కాల్చడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రాజధాని నగరంలో కాలుష్య కట్టడికి తాము ఏటా ఇస్తున్న ఆదేశాలు ఆచరణలో అమలు కాకుండా కేవలం నామమాత్రంగానే మిగిలిపోతున్నాయని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య రహిత దీపావళిని జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడానికి క్రీడాకారులు లేదా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న ప్రముఖ వ్యక్తులు వంటి ప్రముఖుల సేవలను ఎందుకు ఉపయోగించుకోకూడదు..? అని ప్రశ్నించింది. ముఖ్యంగా ఢిల్లీ నగరంలో అవగాహన కార్యక్రమాల కోసం ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రసిద్ధ క్రికెటర్లను సంప్రదించాలని జస్టిస్ సుందరేష్ సూచించారు.
దీపావళి పండుగలో బాణాసంచా భాగం కాదు..
‘కాలుష్య రహిత ఢిల్లీ కోసం విరాట్ కోహ్లీ వంటి ప్రముఖ క్రికెటర్లను సంప్రదించండి. వారు ముందుకొచ్చి దీపావళిని వెలుగుల పండుగగా, కాలుష్యరహితంగా జరుపుకోవాలనే సందేశంతో వీడియోలు లేదా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించవచ్చు. మీరు చెబితే వాళ్లు వచ్చి చేస్తారు. ఈ విషయంలో సాయం చేస్తారు’ అని సుప్రీం ధర్మాసనం అధికారులకు సూచించింది. అదేవిధంగా దీపావళి పండుగలో బాణాసంచా కాల్చడం అనేది అసలు సంప్రదాయంలో భాగం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కాలక్రమేణా అది పండుగతో ముడిపడిపోయిందని పేర్కొంది. టపాసులు కాల్చడం మొదలైనప్పుడే అసలు సమస్య వచ్చిందని తెలిపింది.
ఆ గ్రీన్ క్రాకర్స్ నకిలీవి
ఈ విచారణ సందర్భంగా అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ మాట్లాడుతూ.. పటాకులు రక్తంలోకి ప్రవేశించి కీలక అవయవాలపై ప్రభావం చూపే పీఎం2.5 (PM2.5) వంటి ప్రమాదకర కణాలు, విషపూరిత వాయువులను విడుదల చేస్తాయని తెలిపారు. చిన్నారులు, ధూమపానం చేయనివారితో సహా అందరిలోనూ ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వివరించారు. మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ పేరుతో అమ్ముడవుతున్న అనేక ఉత్పత్తులు నకిలీవని, వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని వాదించారు. అసలైన గ్రీన్ క్రాకర్స్ కూడా సాధారణ టపాసుల కంటే దాదాపు 30 శాతం తక్కువ కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి తప్ప, అవి పూర్తిగా కాలుష్య రహితం కాదని స్పష్టం చేశారు. సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ అమల్లోకి వచ్చే వరకు పటాకులపై నిషేధాన్ని కొనసాగించాలని కోర్టును అభ్యర్థించారు.
పూర్తి నిషేధం విధించాలి
ఈ సందర్భంగా బాణాసంచా తయారీపై పూర్తి నిషేధం విధించాలని పిటిషనర్ గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టును కోరారు. బాణాసంచా కారణంగా వెలువడే కాలుష్యం జీవించే హక్కుకు తీవ్ర ముప్పుగా మారుతోందని అన్నారు. బాణాసంచా తయారీ పరిశ్రమల్లో, ముఖ్యంగా శివకాశి వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బాలకార్మికులను ఉపయోగిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం
వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలపై ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మొత్తం 39 మానిటరింగ్ స్టేషన్లలో కేవలం 9 మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయని ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు నిలదీసింది. తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, అక్రమ బాణాసంచా అమ్మకాలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
ఢిల్లీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు బదులిస్తూ.. రాజధానిలో వాయు కాలుష్యం అనేది ప్రతి సంవత్సరం ఎదురవుతున్న తీవ్ర సమస్య అని తెలిపారు. దీన్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1 నుండి అమలు చేయనున్న ప్రత్యేక ప్రణాళికను ఆమె వివరించారు. అంతేకాదు, గతేడాదితో పోలిస్తే కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మరింత మెరుగైన సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. అయితే, బాణాసంచా వాడకానికి అనుమతి ఉన్న రోజుల్లో గాలి నాణ్యతా సూచీ (AQI) స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె అంగీకరించారు.
Also Read..
భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!
ట్రిబ్యునళ్లను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీం ఆగ్రహం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | ట్రిబ్యునళ్లను పూర్తిగా హైజాక్ చేశారు.. కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీం ఆగ్రహం
అక్టోబర్ 30, 2026

Sonia Gandhi | రూ.12వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది.. ర్యాలీని వాయిదా వేసుకోండి.. సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
అక్టోబర్ 30, 2026

Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?
- ●India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?
- ●Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు
- ●Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా
- ●Karwa Chauth | భార్య కర్వా చౌత్ వ్రతం చేయనందని.. విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించిన భర్త..!
- ●Bandi Sanjay | రైతును రారాజుగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం: బండి సంజయ్

Padi Koushik Reddy | క్రాప్ హాలిడే ఇయ్యడానికి నువ్వెవరు.. తెలంగాణ నీ జాగీరా?

India Poverty | భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ఇక అంతా హ్యాపీయేనా..?

Kondagattu Anjanna | నాకు బంగారం ఇప్పిస్తే.. నీకు వెండి గద చేయిస్తా.. కొండగట్టు అంజన్నకు భక్తుల కోరికలు

Formula E Racing case | రేసింగ్ కేసు.. డిసెంబర్ 4కు వాయిదా



