త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court lawyers | సీఈసీకి వ్య‌తిరేకంగా ర్యాలీ చేప‌ట్టిన న్యాయ‌వాదులు అరెస్ట్‌.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్

Supreme Court lawyers | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులు (senior lawyers) ఇవాళ ఆందోళ‌న చేప‌ట్టారు.

D

National | Published On Oct 10, 2026, 12.59 pm IST

Supreme Court lawyers | సీఈసీకి వ్య‌తిరేకంగా ర్యాలీ చేప‌ట్టిన న్యాయ‌వాదులు అరెస్ట్‌.. ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
Advertisement

Supreme Court lawyers | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులు (senior lawyers) ఇవాళ ఆందోళ‌న చేప‌ట్టారు. సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అనంత‌రం వారిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయ‌వాదుల‌తోపాటూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కి చెందిన పలువురు నిరసనకారులను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు బ‌స్సు ఎక్కించి అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సీనియర్ న్యాయ‌వాదుల‌ను నిర్బంధించ‌డంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (Supreme Court Bar Association) తీవ్రంగా స్పందించింది. ఈ విష‌యంలో వెంట‌నే జోక్యం చేసుకోవాల్సిందిగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ను విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేర‌కు సీజేఐకి లేఖ రాసింది. మహిళా న్యాయవాదులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బ‌ల‌గాలు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించార‌ని లేఖ‌లో ఆరోపించింది.

ఇదిలా ఉండ‌గా.. న‌గ‌రంలో త‌మ పార్టీ నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకోవ‌డంపై సీజేపీ తీవ్ర (CJP Protests) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం జెన్-జీ (Gen Z) యువతకు భయపడి దేశంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీని అమ‌లు చేస్తోంద‌ని ఆరోపించింది. "దేశ యువతను పాకిస్తానీల మాదిరిగా ఎందుకు చూస్తున్నారు..?" అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సంద‌ర్భంగా అరెస్టుల‌కు తాము భ‌యప‌డ‌బోమ‌ని సీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఢిల్లీలో త‌మ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించి తీరుతామ‌ని తేల్చి చెప్పారు.

Also Read..

జ్ఞానేశ్ కుమార్​​ వెళ్లిపోతారు.. మోదీ ప్రభుత్వం కూడా పోతుంది : రాహుల్ గాంధీ

ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వసతుల కల్పనే ప్ర‌భుత్వ‌ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర రావు

సొంత ప్ర‌జ‌ల‌తోనే యుద్ధం చేస్తున్న మోదీ స‌ర్కార్‌: అభిజీత్ దీప్కే

Advertisement
Advertisement