త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | సొంత ప్ర‌జ‌ల‌తోనే యుద్ధం చేస్తున్న మోదీ స‌ర్కార్‌: అభిజీత్ దీప్కే

Abhijeet Dipke | ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌భుత్వం త‌మ‌కు భ‌య‌ప‌డుతున్న‌ద‌ని, అందుకే త‌న సొంత‌ ప్ర‌జ‌ల‌తోనే యుద్ధం చేస్తున్న‌ద‌ని కాక్రోచ్ జ‌న‌తాపార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) విమ‌ర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ (SIR)​పై తమ పోరాటాన్ని కొనసాగిస్తానని స్ప‌ష్టం చేశారు.

G

National | Published On Oct 10, 2026, 12.19 pm IST

Abhijeet Dipke | సొంత ప్ర‌జ‌ల‌తోనే యుద్ధం చేస్తున్న మోదీ స‌ర్కార్‌: అభిజీత్ దీప్కే
Advertisement

Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌భుత్వం త‌మ‌కు భ‌య‌ప‌డుతున్న‌ద‌ని, అందుకే త‌న సొంత‌ ప్ర‌జ‌ల‌తోనే యుద్ధం చేస్తున్న‌ద‌ని కాక్రోచ్ జ‌న‌తాపార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) విమ‌ర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ (SIR)​పై తమ పోరాటాన్ని కొనసాగిస్తానని స్ప‌ష్టం చేశారు. జైలు శిక్ష వంటి బెదిరింపులతో తమ పోరాటాన్ని ఆపలేరని చెప్పారు. జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేన‌ని, త‌మ‌ను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవాల‌న్నారు. ఎన్ఎస్ఏ (NSA), యూఏపీఏ (UAPA), లేదా మీకు నచ్చిన ఏ చట్టాలనైనా విధించినా తాము భయపడేది లేదని వెల్ల‌డించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వెళ్లే ముందు ముంబైలో ఆయ‌న ఏఎన్ఐతో మాట్లాడారు. నిరసన తెలపడం త‌మ‌ ప్రాథమిక హక్కు అని, ప్రజాస్వామ్యయుతమైన, శాంతియుతమైన పద్ధతిలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కును ఆర్టికల్ 19 కల్పిస్తుంద‌న్నారు. తాము అదే చేయనున్నామ‌ని చెప్పారు.

`ఈ దేశ యువత అన్నా, ప్రజలన్నా ప్ర‌ధాని మోదీకి ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదు. అసలు రైల్వే సర్వీసులన్నింటినీ నిలిపివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మెట్రో సర్వీసులన్నింటినీ ఆపేయాల్సిన అవసరం ఏముంది?. ఇంటర్నెట్‌ను కట్ చేశారు, రోడ్లను దిగ్బంధించారు. జమ్ముక‌శ్మీర్ నుంచి సైన్యాన్ని (Army), నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచి సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలను ర‌ప్పించి ఢిల్లీలో మోహరించారు. ప్ర‌ధాని మోదీ, అమిత్ షా (Amit Shah) తమ సొంత‌ ప్రజలపైనే యుద్ధం ప్రకటించాలనుకుంటున్నారా?. జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) వారికి అంత ఆప్తులా? ఆయన కోసం తమ సొంత పౌరులపైనే పోలీసు, ఆర్మీ బలగాలను ప్రయోగిస్తున్నారా?

ప్ర‌ధాని మోదీ భయపడుతున్నారు. ఈ దేశ ప్రజలు తనకు ఓటు వేయరని ఆయన భయపడుతున్నారు. అందుకే, అధికారాన్ని కాపాడుకోవడానికి రైళ్లలో ఉన్న ప్రజలను కూడా బలవంతంగా పట్టుకుపోతున్నారు. నిరసనల్లో పాల్గొనవద్దని సొసైటీలలో ప్రకటనలు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇళ్లకు వెళ్లి, నిరసనల్లో పాల్గొనవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. కానీ తాము ఎందుకు పాల్గొనకూడదు? నిరసన తెలపడం మా ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును ఆర్టికల్ 19 మనకు ప్రసాదిస్తుంది. మేము సరిగ్గా అదే చేయాలని నిశ్చయించుకున్నాం.` అని దీప్కే చెప్పారు.

అజ్ఞాత ప్రాంతానికి దీప్కే..

ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న దీప్కేను పోలీసులు విమానంలో నిర్భంధించారు. విమానం నుంచి దిగ‌క‌ముందే ఆయ‌న‌తోపాటు అశుతోశ్, సౌరవ్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వారిని విమానాశ్రయం వెనుక గేట్ నుంచి అజ్ఞాతప్రాంతానికి తరలించారు. వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు సమాచారం ఇవ్వలేదు. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.

Advertisement
Advertisement