త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వసతుల కల్పనే ప్ర‌భుత్వ‌ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర రావు

Tummala Nageswara Rao | ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న‌దని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు (Tummala Nageswara Rao) అన్నారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే కాదు, పౌరుల పూర్తి సహకారం, భాగస్వామ్యం ఉన్నప్పుడే సంపూర్ణ పరిశుభ్రత సాధ్యమవుతుందని చెప్పారు.

G

Telangana | Published On Oct 10, 2026, 12.38 pm IST

Tummala Nageswara Rao | ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వసతుల కల్పనే ప్ర‌భుత్వ‌ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర రావు
Advertisement

Tummala Nageswara Rao | త్రినేత్ర న్యూస్‌: ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న‌దని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు (Tummala Nageswara Rao) అన్నారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే కాదు, పౌరుల పూర్తి సహకారం, భాగస్వామ్యం ఉన్నప్పుడే సంపూర్ణ పరిశుభ్రత సాధ్యమవుతుందని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 9,12,13,14వ డివిజన్ల పరిధిలోని మధురానగర్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను మంత్రి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంద‌న్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా, ప్రతి డివిజన్‌లోనూ సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్ల‌డించారు. ఖమ్మం నగరంలో అన్ని మతాలు, కులాలకు చెందిన ప్రజలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా, ఆనందంగా జీవించాలన్నారు.

Advertisement
Advertisement