Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్‌చుక్‌కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
Sonam Wangchuk | పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనదని, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
Sonam Wangchuk | నీట్ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా గత కొన్ని రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన వైద్య చికిత్స వెంటనే అందించాలని కేంద్రంతోపాటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనదని, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కాగా, వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష నేడు 19వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన్ని రక్షించాలంటూ న్యాయవాది రాకేష్ కుమార్ సైని (Rakesh Kumar Saini) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 8 కేజీల బరువు తగ్గారని, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గాయని సదరు న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తీవ్ర నీరసం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. మరో రెండు రోజుల్లో వాంగ్‌చుక్ చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
దీక్ష విరమించేది లేదు..
మరోవైపు దీక్ష విరమించాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంపై సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. తాను దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకుండానే తాను దీక్ష విరమిస్తే అది సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ జవాబుదారీతనం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటూ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. తన ఆరోగ్యం క్షీణించినమాట వాస్తవమేనని.. కానీ అత్యంత ప్రమాదకర స్థితికేం దిగజారలేదని వ్యాఖ్యానించారు. దీక్ష విరమించమని కోరడం బదులు.. జులై 20న నిర్వహించనున్న చలో సంసద్ (Chalo Sansad) కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జులై 20న నిర్వహించనున్న చలో సంసద్ (Chalo Sansad) కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. 'చలో సంసద్'లో పాల్గొనాలనుకునే వారు ప్రచార వెబ్‌సైట్ లేదా మిస్డ్ కాల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. "జులై 20న వేలాదిగా తరలి రండి. ఈ సమస్యను ప్రజల తరఫున పార్లమెంట్ ముందుంచుదాం. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ తన బాధ్యతను నిర్వర్తించే అవకాశం ఉంటుంది" అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.
Also Read..
ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Maternity leave | ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా తగ్గించకూడదు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు
సెప్టెంబర్ 2, 2026

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Kavitha | సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు..!
- ●Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్
- ●Minister Ponguleti | త్వరలో మూడులక్షల కొత్త పెన్షన్లు.. ప్రకటించిన మంత్రి పొంగులేటి
- ●KTR Seed Ganesh | కేటీఆర్‌కు 'సీడ్ గణేశ్'.. నిమజ్జనం చేశాక పచ్చని మొక్కగా మారనున్న ఈ వినాయకుడు
- ●Telangana RTC employees | ఆర్టీసీ లాభాల్లో ఉంటే ఆ బకాయిల సంగతేంటి?
- ●KTR | సెప్టెంబర్ 7న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తాం

Kavitha | సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు..!

Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్

Minister Ponguleti | త్వరలో మూడులక్షల కొత్త పెన్షన్లు.. ప్రకటించిన మంత్రి పొంగులేటి

KTR Seed Ganesh | కేటీఆర్‌కు 'సీడ్ గణేశ్'.. నిమజ్జనం చేశాక పచ్చని మొక్కగా మారనున్న ఈ వినాయకుడు



