IRCTC | కొత్త IRCTC లో క్యాప్చాలు..పాప్ అప్ లు ఉండవు. హ్యప్పీగా టికెట్ బుక్ చేసుకోండి
IRCTC | భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌కు పూర్తిగా కొత్త రూపాన్ని తీసుకొస్తూ బీటా వెర్షన్‌ను అధికారికంగా ప్రారంభించింది. గత నెలలో జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ (MNIT) విద్యార్థులతో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జూలై 15 నాటికి కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించగా, ఆ హామీ మేరకు ప్రస్తుతం బీటా వెర్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
Technology | Published On Jul 16, 2026, 11.49 am IST
IRCTC | భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌కు పూర్తిగా కొత్త రూపాన్ని తీసుకొస్తూ బీటా వెర్షన్‌ను అధికారికంగా ప్రారంభించింది. గత నెలలో జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ (MNIT) విద్యార్థులతో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జూలై 15 నాటికి కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించగా, ఆ హామీ మేరకు ప్రస్తుతం బీటా వెర్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ బీటా వెర్షన్‌ను ప్రయాణికులు ఉపయోగించి, కొత్త ఇంటర్‌ఫేస్‌పై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని రైల్వే శాఖ కోరింది. పూర్తి స్థాయి విడుదలకు ముందు వినియోగదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపింది.
వేగవంతమైన పనితీరు, ఫ్రెండ్లీ డిజైన్..
కొత్తగా రూపొందించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో క్లీన్ డిజైన్, వేగవంతమైన పనితీరు, మరింత యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించేలా మార్పులు చేశారు. ముఖ్యంగా టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటీ) విద్యార్థులు ఇచ్చిన సూచనలు ప్రేరణగా నిలిచాయని రైల్వే శాఖ వెల్లడించింది. వెబ్‌సైట్ డిజైన్, ఫంక్షనాలిటీ, యూజర్ అనుభవాన్ని ఎలా మెరుగుపరచాలనే అంశాలపై వారు సూచనలు అందించారు. 2002లో ప్రారంభమైన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆన్‌లైన్ ప్రజా సేవా పోర్టల్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రతిరోజూ సగటున 14.5 లక్షల రైల్వే టికెట్ల బుకింగ్‌లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరుగుతున్నాయి.
క్యాప్చాలు, పాప్-అప్‌లు తొలగింపు..
కొత్త బీటా వెర్షన్‌లో అవసరం లేని క్యాప్చాలు, పాప్-అప్‌లు, దృష్టి మరల్చే గ్రాఫిక్స్‌ను తొలగించారు. అలాగే ఇంటర్‌ఫేస్‌ను సరళీకరించి, టికెట్ బుకింగ్ పూర్తయ్యే వరకు ఉండే స్టెప్‌ల సంఖ్యను తగ్గించడం ద్వారా బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఇక ప్రయాణికులు ఒకేసారి అన్ని ట్రావెల్ క్లాస్‌లలో సీట్ల లభ్యతను సులభంగా తెలుసుకోగలుగుతారు. అలాగే ముందుగా సేవ్ చేసిన ప్రయాణికుల వివరాలను మరింత సమర్థవంతంగా సమీకరించడం వల్ల తరచూ టికెట్లు బుక్ చేసే వారికి వేగంగా బుకింగ్ పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. వెబ్‌సైట్ మార్పులతోపాటు, రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థకు గుండెకాయగా పనిచేసే ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌ను కూడా రైల్వే శాఖ ఆధునీకరిస్తోంది. ప్రతిరోజూ కోట్లాది మంది ఆధారపడే ఈ కీలక వ్యవస్థ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ అప్‌గ్రేడ్ పనులు కొనసాగుతున్నాయి.
ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే శాఖ..
త్వరలోనే అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌ను కూడా ప్రారంభించి, కొత్త ఐఆర్‌సీటీసీ పోర్టల్‌తో అనుసంధానం చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందు బీటా దశలో వినియోగదారులు తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
సంబంధిత వార్తలు

Char Dham Yatra | చార్ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
సెప్టెంబర్ 2, 2026

IRCTC | ఒక్క టూర్లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
ఆగస్టు 29, 2026

Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి
- ●Kavitha | సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు..!
- ●Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!

Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి



