Kavitha | సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు..!
Kavitha | సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేశ్ సస్పెన్షన్ వేటు వేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కే అనిల్‌పై సర్వీసు క్రమశిక్షణ నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
Kavitha | సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేశ్ సస్పెన్షన్ వేటు వేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కే అనిల్‌పై సర్వీసు క్రమశిక్షణ నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సైబరాబాద్ కార్ (CAR) నుంచి ‘ఆర్డర్ టు సర్వ్’లో భాగంగా హైదరాబాద్ కార్ (CAR) హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న అనిల్.. సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు అతన్ని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని పాటించాల్సిందేనని సీపీ రమేశ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంలోనూ పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?
- ●Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?






