త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagannath Rath Yatra | ఘ‌నంగా జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌.. భ‌క్తుల‌తో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

Jagannath Rath Yatra | ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) గురువారం ఘ‌నంగా ప్రారంభమైంది.

D

National | Published On Jul 16, 2026, 12.15 pm IST

Jagannath Rath Yatra | ఘ‌నంగా జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌.. భ‌క్తుల‌తో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
Advertisement

Jagannath Rath Yatra | ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) గురువారం ఘ‌నంగా ప్రారంభమైంది. ర‌థ‌యాత్ర‌ను క‌నులారా వీక్షించేందుకు దేశం న‌లుమూల‌ల నుంచి ల‌క్ష‌లాది మంది భక్తులు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు ‘జై జగన్నాథ్‌’, ‘హరిబోల్‌’ నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నారు.

ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి గుండిచా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్ర‌స్తుతం పూరీ క్షేత్రంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. అయినా భ‌క్తులు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. జగన్నాథుడు (Lord Jagannath), బలభద్రుడు (BalaBhadra), సుభద్రా దేవి (Subhdra Devi) కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు వ‌ర్షంలోనూ గొడుగులు ప‌ట్టుకుని మ‌రీ పోటీపడ్డారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం భ‌క్తులు అదృష్టంగా భావిస్తారు.

ఈ యాత్ర సంద‌ర్భంగా అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేల సంఖ్య‌లో పోలీసులు, కేంద్ర బ‌ల‌గాలు మోహ‌రించారు. కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ప్ర‌భుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హరినామ స్మరణలు, స్వామి నామ సంకీర్తనలు, రథాల చక్రాల కదలికల మధ్య పూరీ వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఆక‌ట్టుకుంటున్న సైక‌త శిల్పం..

ఈ ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని పూరీ తీరంలో ఒడిశాకు చెందిన‌ ప్ర‌ముఖ సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ రథయాత్రను ప్రతిబింబించేలా రూపొందించిన సైక‌త శిల్పం ఆక‌ట్టుకుంటోంది. వంద రథాలతో కూడిన ఈ సైకత శిల్పం రూపకల్పనలో రకరకాల రంగులను పట్నాయక్‌ వినియోగించారు.

Advertisement
Advertisement