త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్స‌వం వేళ ఢిల్లీలో వ‌రుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్‌, హైకోర్టు, రైళ్లు

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్స‌వానికి (Independence Day) ఒక్క‌రోజు ముందు దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో వ‌రుస‌ బాంబు బెదిరింపులు (Bomb Threats) క‌ల‌క‌లం రేపాయి. చారిత్రాత్మ‌క ఎర్ర‌కోట (Red Fort), ఇందిరా గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ టెర్మిన‌ల్‌-3 (IGI Airport), ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స‌హా ఎన్సీఆర్ ప్రాంతంలోని ప‌లు కార్యాల‌యాల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి.

D

National | Published On Aug 14, 2026, 1.46 pm IST

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్స‌వం వేళ ఢిల్లీలో వ‌రుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్‌, హైకోర్టు, రైళ్లు
Advertisement

Bomb Threats | త్రినేత్ర‌.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్స‌వానికి (Independence Day) ఒక్క‌రోజు ముందు దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో వ‌రుస‌ బాంబు బెదిరింపులు (Bomb Threats) క‌ల‌క‌లం రేపాయి. చారిత్రాత్మ‌క ఎర్ర‌కోట (Red Fort), ఇందిరా గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ టెర్మిన‌ల్‌-3 (IGI Airport), ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స‌హా ఎన్సీఆర్ ప్రాంతంలోని ప‌లు కార్యాల‌యాల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. జామ్ న‌గ‌ర్ హౌస్‌, జండేవాలాన్ బిల్డింగ్‌, ఎంబీ సాకేత్ ఆఫీస్‌, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎస్‌డీఎం ఆఫీస్‌కు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

కోర్టుల‌ ప్రాంగ‌ణాల్లో పేలుళ్లు

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న మ‌ధ్యాహ్నం 2:11 గంట‌ల‌కు కోర్టు ప్రాంగ‌ణంలో బాంబు పేలుడు సంభ‌విస్తుంద‌ని ఆగంత‌కులు బెదిరింపు మెయిల్ పంపారు. అంతేకాదు, మధ్యాహ్నం 3:11 గంటలకు జిల్లా కోర్టుల్లో బాంబు పేలుళ్లు సంభవిస్తాయని అందులో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆగంత‌కులు ఖ‌లిస్థాన్‌, 1984 నాటి సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల‌ను ప్ర‌స్తావించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ మెట్రో లైన్ల‌తోపాటూ అంబాలా నుంచి వ‌చ్చే రైళ్ల‌లో కూడా పేలుళ్లు సంభ‌విస్తాయ‌ని అందిలో బెదిరించారు.

పోలీసులు అల‌ర్ట్‌..

బెదిరింపు మెయిల్‌తో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు అన్ని ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఫైర్ ఇంజిన్ల‌ను మోహ‌రించారు. ఇప్ప‌టికే జ‌రిపిన ప్రాథ‌మిక త‌నిఖీల్లో ఆయా ప్ర‌దేశాల్లో ఎలాంటి అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. ఈ మేర‌కు బాంబు బెదిరింపుల ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాకు అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు

విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వాళ్లెవ‌రు..? బీసీఐపై సీజేఐ ఆగ్ర‌హం

తెలంగాణ వ్య‌తిరేక అంశాల‌ను ఎజెండా నుంచి తొల‌గించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజ‌రైతే చూస్తూ ఊరుకోం

Advertisement
Advertisement