CJPs X handle | కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాపై బ్యాన్ ఎత్తివేయాలంటూ కోర్టు ఆదేశం
CJPs X handle | ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party)కి భారీ ఊరట లభించింది. గతంలో బ్లాక్ చేసిన సీజేపీ ఎక్స్ ఖాతాను (CJPs X handle) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది.
CJPs X handle | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియాలో రాజకీయ ఉద్యమంగా పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party)కి భారీ ఊరట లభించింది. గతంలో బ్లాక్ చేసిన సీజేపీ ఎక్స్ ఖాతాను (CJPs X handle) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలోనే తాము ఈ ఖాతాను బ్లాక్ చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ఆ ఖాతా నుంచి వచ్చిన కొన్ని పోస్టులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని చెప్పారు. అయితే, ఇప్పుడు నీట్ పరీక్ష పూర్తైన నేపథ్యంలో ఖాతాను అన్‌బ్లాక్ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక ఆందోళనకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతాను నిలిపివేస్తూ కేంద్రం ఇచ్చిన బ్లాకింగ్ ఆర్డర్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. కాగా, కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను మేలో కేంద్రం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.
Also Read..
సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సంబంధిత వార్తలు

Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
జులై 16, 2026

Sonam Wangchuk | రెండు రోజుల్లో చనిపోవచ్చు.. వాంగ్చుక్ను రక్షించండి.. ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
జులై 15, 2026

Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష
జులై 10, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?



