Seethakka | చిన్నారులున్న చోటుకే మొబైల్ అంగన్వాడి కేంద్రాలు
Seethakka | చిన్నారుల భవిష్యతు కోసం.. ఏ ఒక్కరూ అంగన్వాడీ సేవలకు దూరం కావొద్దని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి కోసం మొబైల్ వాహన సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులే దేశ సంపద అన్నారు. తెలంగాణ-2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలకంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఏ చిన్నారి అంగన్వాడీకి దూరం కావొద్దు
- తెలంగాణ-2047 లక్ష్య సాధనలో వారే కీలకం
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొబైల్ వాహనం ప్రారంభంలో మంత్రి సీతక్క
Seethakka | త్రినేత్ర.న్యూస్: చిన్నారుల భవిష్యతు కోసం.. ఏ ఒక్కరూ అంగన్వాడీ సేవలకు దూరం కావొద్దని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి కోసం మొబైల్ వాహన సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులే దేశ సంపద అన్నారు. తెలంగాణ-2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలకంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్వాడి వాహనాన్ని ఆమె మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ మొబైల్ అంగన్వాడి వాహనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో సేవలు అందించనుందని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ఇప్పటివరకు సాంప్రదాయ అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లి శిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవి. అంగన్వాడి కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ఉపాధి కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా ప్రభుత్వ సేవలకు దూరం కావొద్దనే లక్ష్యంతో ఈ మొబైల్ అంగన్వాడి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి అని సీతక్క పేర్కొన్నారు.
ప్రజలు ఉన్న చోటుకే ప్రభుత్వ సేవలు..
పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల పర్యవేక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లి శిశు సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలను ఈ వాహనాల ద్వారా అందిస్తాం. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు ఈ మొబైల్ అంగన్వాడి వాహనాలు నేరుగా వెళ్లి సేవలు అందిస్తాయి. ఒక్కో మొబైల్ అంగన్వాడి వాహనం దాదాపు పది అంగన్వాడి కేంద్రాలకు సమానంగా సేవలు అందిస్తుంది. ఒక్కో మొబైల్ అంగన్వాడి కేంద్రం ద్వారా సుమారు 300 మంది లబ్ధిదారులకు సేవలు అందుతాయి. ప్రభుత్వ సేవలను ప్రజలు ఉన్న చోటుకే తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని మంత్రి సీతక్క వెల్లడించారు.
చిన్నారి చిరునవ్వే అభివృద్ధికి ప్రతీక..
చిన్నారి చిరునవ్వే నిజమైన అభివృద్ధికి ప్రతీక. మొబైల్ అంగన్వాడి కేంద్రాలు ప్రతి చిన్నారికి పోషకాహారం, ఆరోగ్యం, విద్యను చేరవేసి ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి చిన్నారి సమగ్ర అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోంది అని సీతక్క చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, మేడ్చల్ మల్కాజ్గిరి డీడబ్ల్యూవో శారద, కార్మిక మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Nizamabad | భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య
- ●FIFA 2026 | ప్రపంచకప్‌లో అమెరికా ఓటమి.. ముదిరిన వివాదం
- ●Emmanuel Macron | హోటల్ వద్ద వరుస పేలుళ్లు.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు
- ●Contract Employees Salary Telangana | ఇక ఏజెన్సీల ఆటకట్టు.. ఒకటో తేదీనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు
- ●EPFO | పీఎఫ్ విత్‌డ్రాలో ట్యాక్స్ ఎప్పుడు విధిస్తారు, కొత్త రూల్స్ ఇవే..
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా గ్లామర్ ట్రీట్ - జాన్వీ కపూర్ ప్రశంసలు

Nizamabad | భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి.. ప్రాణాలు తీసిన భార్య

FIFA 2026 | ప్రపంచకప్‌లో అమెరికా ఓటమి.. ముదిరిన వివాదం

Emmanuel Macron | హోటల్ వద్ద వరుస పేలుళ్లు.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు

Contract Employees Salary Telangana | ఇక ఏజెన్సీల ఆటకట్టు.. ఒకటో తేదీనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు






