Gujarat High Court | ఆ 38 మందికి ఉరిశిక్ష.. గుజరాత్ కోర్టు సంచలన తీర్పు
Gujarat High Court | 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు (2008 Ahmedabad serial blasts case)లో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) సంచలన తీర్పు వెలువరించింది.
Gujarat High Court | త్రినేత్ర.న్యూస్ : 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు (2008 Ahmedabad serial blasts case)లో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు నిందితులందరికీ శిక్ష ఖరారు చేస్తూ... జస్టిస్ ఎ.వై. కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని అప్పీళ్లను తోసిపుచ్చింది. మొత్తం 48 మంది దోషులకు ఒకొక్కరికి రూ.2.85 లక్షలు చొప్పున జరిమానా విధించింది. కాగా, ఒకే కేసులో 38 మందికి మరణశిక్షలు ఖరారు కావడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక పేలుళ్ల ఘటనలో మరణించిన వారి కుటుంబానికి రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన ప్రతి బాధితుడికి రూ.50వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 వేలు చొప్పున పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ నష్టపరిహార ప్రక్రియ మొత్తాన్ని మార్చి 31, 2027 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం గడువు విధించింది.
26 జులై 2008 గుజరాత్ అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులు, సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేశారు. ఈ మారణహోమంలో 56 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మంది గాయపడ్డారు. ఈ కేసులో 49 మందిపై దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద కేసులు నమోదయ్యాయి.
దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2022 ఫిబ్రవరి 8న కీలక తీర్పు వెలువరించింది. 38 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి జీవితకాలం జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
- ●Hospital Fire | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
- ●Stock Markets | క్రూడ్ ధరలు, గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- ●Amit Shah | భారత్ ధర్మశాల కాదు.. ఇక్కడ నివసించే హక్కు దేశ ప్రజలకు మాత్రమే ఉంది : అమిత్ షా
- ●Asaduddin Owaisi | ఇస్లాంలో ఏది అవసరమో.. ఏది కాదో నిర్ణయించడానికి మీరెవరు?: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- ●Rahul Gandhi | నటికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగన కౌంటర్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..

Hospital Fire | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం

Stock Markets | క్రూడ్ ధరలు, గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Amit Shah | భారత్ ధర్మశాల కాదు.. ఇక్కడ నివసించే హక్కు దేశ ప్రజలకు మాత్రమే ఉంది : అమిత్ షా




