Karur Stampede Case | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Karur Stampede Case | కరూర్ తొక్కిసలాట కేసు (Karur Stampede Case)లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)కి భారీ ఊరట దక్కింది.
Karur Stampede Case | త్రినేత్ర.న్యూస్ : కరూర్ తొక్కిసలాట కేసు (Karur Stampede Case)లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)కి భారీ ఊరట దక్కింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకూ తొక్కిసలాట ఘటనపై టీవీకే మంత్రులు, ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ డీఎంకే ( DMK) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. విచారణ సందర్భంగా డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును రాజకీయ వేదికగా మార్చకండి అంటూ వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంపై వెకేషన్ బెంచ్ ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించినప్పుడు.. ఒక రాజకీయ ప్రత్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను తాము ఎలా విచారిస్తామని కోర్టు ప్రశ్నించింది. తొక్కిసలాట ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా సీఎం విజయ్ పేరు ఎక్కడా లేదని తెలిపింది. ముఖ్యమంత్రి ఏం చేయాలి..? ఏం మాట్లాడాలో కూడా సుప్రీంకోర్టే చెప్పాలా..? అంటూ నిలదీసింది. ముఖ్యమంత్రి విజయ్ ఈ కేసులో నిందితుడు కాదని తెలిపింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుపైనా ఆంక్షలు కోరుతున్నారా..? అంటూ డీఎంకేకు చురకలంటించింది. ఈ మేరకు పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని డీఎంకేకి సూచించింది. దాంతో డీఎంకే తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.
గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 142 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే, సీబీఐ విచారణ పూర్తయ్యే వరకూ ఈ ఘటనపై టీవీకే మంత్రులు బహిరంగ ప్రకటనలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ డీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మంత్రి ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని డీఎంకే పిటిషన్‌లో పేర్కొంది. జులై 2న జరిగిన సభలో మాట్లాడుతూ.. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ గత డీఎంకే ప్రభుత్వాన్నే కరూర్ విషాదానికి బాధ్యతలుగా ఆరోపించారంటూ డీఎంకే నేత పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తును ఎదుర్కొంటున్న వ్యక్తి, అదీ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, సీబీఐ విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని డీఎంకే వాదిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే నాయకత్వంపై ప్రజలను తప్పుదారి పట్టించే అభిప్రాయం కల్పించడమే మంత్రి వ్యాఖ్యల ఉద్దేశమని ఆరోపించింది.
సంబంధిత వార్తలు

CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్
జులై 10, 2026

CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జులై 10, 2026

Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
జులై 9, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



