త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR Row | ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై విపక్షాల ఆందోళనకు కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీకి సంఘీభావం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వైఖరిని ప్రశ్నిస్తూ ‘జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాలి’ అంటూ నినాదాన్ని తన ప్రకటనలో ప్రస్తావించింది.

P

National | Published On Oct 28, 2026, 10.03 pm IST

SIR Row | ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు
Advertisement

SIR | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై విపక్షాల ఆందోళనకు కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీకి సంఘీభావం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వైఖరిని ప్రశ్నిస్తూ ‘జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాలి’ అంటూ నినాదాన్ని తన ప్రకటనలో ప్రస్తావించింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతాయన్న ఆందోళనలను పార్టీ వ్యక్తం చేసింది. ఓటు హక్కును సులభతరం చేయాల్సింది పోయి.. ప్రజల్లో హక్కు కోల్పోతామనే భయాన్ని పెంచడం సరికాదని పేర్కొంది. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి తప్ప.. ఎవరికి ఓటు వేసే అర్హత ఉందో ప్రభుత్వం నిర్ణయించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం పోరాడే సంస్థలకు అండగా నిలుస్తామని తెలిపింది.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్‌, తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సహా రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన నేతలు ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు కల్పించారని పార్టీ గుర్తుచేసింది. కులం, మతం, లింగం, విద్య, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సమాన రాజకీయ హక్కులు అందరికీ ఉండాలని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో అర్హులైన పౌరులను ప్రక్రియ నుంచి దూరం చేయడం కాకుండా.. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం కీలకమని సీజేపీ అభిప్రాయపడింది.

ఎస్‌ఐఆర్‌ అమలుతో ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉండాల్సిన విశ్వాసం దెబ్బతింటోందని కాక్రోచ్‌ జనతా పార్టీ ఆరోపించింది. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం బాధ్యతని పేర్కొంది. రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రభుత్వాలు సమాన రాజకీయ హక్కులను కాపాడాలని కోరింది. ‘జై భీమ్‌.. జై హింద్‌’ నినాదాలతో పాటు ‘దేశమే ప్రథమం’ అనే సందేశంతో తన ప్రకటనను ముగించింది. ఎస్‌ఐఆర్‌ అంశంపై బీజేపీ, విపక్షాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ మద్దతు ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement