Sonia Gandhi | ఆత్మకథలో సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి లీగల్ నోటీసులు
Sonia Gandhi | తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)లో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌ను (Vinayak Damodar Savarkar) బ్రిటీష్ ఇన్ఫార్మర్‌గా పేర్కొనడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి సత్యకి సావర్కర్ (Satyaki Savarkar) లీగల్ నోటీసులు పంపారు.
Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) వివాదంలో చిక్కుకున్నారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)లో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌ను (Vinayak Damodar Savarkar) బ్రిటీష్ ఇన్ఫార్మర్‌గా పేర్కొనడంపై ఆయన కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోనియా గాంధీకి సావర్కర్ మునిమనవడు సత్యకి సావర్కర్ (Satyaki Savarkar) లీగల్ నోటీసులు పంపారు.
పుస్తకంలోని 201, 443 పేజీలలో ఉన్న రెండు ప్రధాన అంశాలపై సత్యకి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులోని వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా, చారిత్రాత్మకంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని చెప్పారు. సావర్కర్ ప్రతిష్టకు, వారసత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. పుస్తకంలో సావర్కర్ వ్యక్తిత్వాన్ని వక్రీకరించారని ఆరోపిస్తూ, బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు బహిరంగ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పుస్తకం, డిజిటల్ వెర్షన్లలో ఈ అభ్యంతరకర భాగాలను తొలగించి సవరణలు చేయాలని కోరారు.
సోనియా తన పుస్తకంలోని 201వ పేజీలో సావర్కర్ బ్రిటిష్ పాలకులకు క్షమాభిక్ష పిటిషన్లు రాశారని, బ్రిటిష్ అధికారులకు సమాచారం అందించే వారితో కలిశారన్న అర్థం వచ్చేలా రాసిన వాఖ్యలను సత్యకి ఖండించారు. ఇది సావర్కర్ త్యాగాలను, జైలు జీవితాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు. అంతేకాదు, పుస్తకంలోని 443వ పేజీలో సావర్కర్ రాజకీయ దృక్పథాన్ని కేవలం 'హిందువుల ఆధిపత్యం'గా (Hindu supremacy) అభివర్ణించారని సత్యకి ఆరోపించారు. సావర్కర్ ప్రసంగాలు, రచనల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని విస్మరించి, ఆయన సిద్ధాంతాన్ని తప్పుగా చిత్రీకరించారని నోటీసులో పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ ప్రస్తావన
సోనియా గాంధీ పుస్తకంలోని వాదనలను తిప్పికొడుతూ.. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రభుత్వం సావర్కర్‌కు ఇచ్చిన అధికారిక గౌరవాలను సత్యకి ఈ నోటీసుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1970లో సావర్కర్ గౌరవార్థం ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను (Postage Stamp) విడుదల చేశారని గుర్తు చేశారు. 'స్వాతంత్య్రవీర్ సావర్కర్ రాష్ట్రీయ స్మారక్' ట్రస్టుకు ఇందిరా గాంధీ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుండి రూ. 11,000 విరాళం అందించారని పేర్కొన్నారు. అంతేకాకుండా 1983లో సావర్కర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫిల్మ్స్ డివిజన్ (Films Division) ద్వారా ఆయన జీవిత చరిత్రపై అధికారిక డాక్యుమెంటరీని రూపొందించారని తెలిపారు. సావర్కర్ నేతృత్వంలో జరిగిన భాగ్యనగర్ (హైదరాబాద్) నిరాయుధ ప్రతిఘటన ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన కార్యకర్తలను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించిన విషయాన్ని కూడా నోటీసులో ప్రస్తావించారు.
15 రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే..
సోనియా గాంధీకి ఢిల్లీలోని నివాసానికి పోస్టు, ఈమెయిల్ ద్వారా ఈ నోటీసులు పంపినట్లు సత్యకి తరఫు న్యాయవాది తెలిపారు. నోటీసు అందిన 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, అభ్యంతర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. తదుపరి ముద్రణలు, రీప్రింట్లు, ఎలక్ట్రానిక్ వెర్షన్ల నుంచి ఆ వివాదాస్పద భాగాలను తొలగించాలని లేదా తగిన విధంగా సవరించాలని నోటీసులో కోరారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
Also Read..
కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు
డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. బిమన్ విమానాన్ని పంపాలని విజ్ఞప్తి
ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. జెన్సన్ పునరాగమనంపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Indiramma’s Quotes Book Launch | ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకం ఆవిష్కరణ.. ముందుమాట రాసిన సోనియా
నవంబర్ 22, 2026

BM Sandip Kumar | కలిసి పని చేస్తేనే గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుద్దాం
నవంబర్ 22, 2026

Sonia Gandhi Childhood Home Italy | మ్యూజియంగా ఇటలీలోని సోనియా గాంధీ పుట్టి పెరిగిన ఇల్లు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Nvidia | ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. జెన్సన్ పునరాగమనంపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు..
- ●Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడ్డాడు.. అప్పు తీర్చలేక బాసర IIIT విద్యార్థి బలవన్మరణం
- ●Health | రోజుకు 20 నిమిషాల వ్యాయామం.. మెదడుకు సూపర్ బూస్ట్! జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మేలు!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓగా జెన్సన్ రాక, 31 శాతం ఎగసిన షేర్లు.. భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద..
- ●Thiruparankundram Hilltop Lamp Ritual | కార్తీక దీపం వేడుకలపై తీవ్ర ఉత్కంఠ.. మదురైలో 144 సెక్షన్ అమలు
- ●Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

Nvidia | ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. జెన్సన్ పునరాగమనంపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు..

Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడ్డాడు.. అప్పు తీర్చలేక బాసర IIIT విద్యార్థి బలవన్మరణం

Health | రోజుకు 20 నిమిషాల వ్యాయామం.. మెదడుకు సూపర్ బూస్ట్! జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మేలు!

Jensen Huang | ఎన్విడియా సీఈఓగా జెన్సన్ రాక, 31 శాతం ఎగసిన షేర్లు.. భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద..



