Bandi Sai Bhagirath | కేసు నమోదు చేయకపోతే.. మోదీ సమక్షంలో ఆత్మహత్య చేసుకుంటాం..!
Bandi Sai Bhagirath | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు అంత సులువుగా నమోదు కాలేదని తెలుస్తున్నది. ఈ కేసు నమోదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు 3 నెలల నుంచి పోలీసుల చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్ చుట్టూ
తిరిగి తిరిగి అలసిపోయాం
కేసు నమోదు చేయమంటే
ఇన్నిసార్లు తిప్పించుకుంటారా?
పరేడ్ గ్రౌండ్ సభ ముందు
ఆత్మార్పణ చేసుకుంటాం
పోలీసులతో.. బాధితురాలి తల్లిదండ్రులు
చివరికి..కేసు నమోదు చేసిన పోలీసులు
Bandi Sai Bhagirath | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు అంత సులువుగా నమోదు కాలేదని తెలుస్తున్నది. ఈ కేసు నమోదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు 3 నెలల నుంచి పోలీసుల చుట్టు తిరుగుతున్నట్లు సమాచారం. కానీ ఇక గత్యంతరం లేక తామ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది.
మోదీ సభలో తేల్చుకుంటాం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్రలో బాలిక కుటుంబం నివాసం ఉంటున్నది. డిసెంబర్ 31న రాత్రి బండి సాయి భగీరథ్ తమ కూతురిని లొంగదీసుకున్నాడన్న విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబసభ్యులు 3 నెలల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమ కూతురికి జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలని పోలీసులను వేడుకున్నారు. అయితే.. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనకాడారు. దీంతో.. ఎటూ పాలు పోని బాలిక తల్లిదండ్రులు .. తాము ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మోదీ సభలోనే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో.. పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్
- ●US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!
- ●Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన రేవంత్
- ●Telangana Irrigation | కిం కర్తవ్యం? సాగునీటికి కటకటేనా..!

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!





