Vinesh Phogat | వినేశ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య షాక్.. పోటీల్లో పాల్గొనకుండా నిషేధం..!
Vinesh Phogat | భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ, యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆరునెలల ముందస్తు నోటీసు ఇవ్వలేదని పేర్కొంటూ ఈ ఏడాది జూన్ వరకు దేశీయ టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎవరైనా అథ్లెట్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ రెజ్లింగ్‌లోకి రావాలనుకుంటే.. కనీసం ఆరు నెలల ముందుగా ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ITA), సంబంధిత అంతర్జాతీయ సమాఖ్యకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ఈ సమయంలో యాంటీ డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిబంధనల ప్రకారం.. దీర్ఘకాలం టెస్టులకు దూరంగా ఉన్న అథ్లెట్ నేరుగా పోటీల్లో పాల్గొనడం వీలుకాదు. అలాంటి పరిస్థితిలో పాల్గొంటే ఫలితాలు చెల్లనివిగా ప్రకటించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
వినేశ్‌ను ఎందుకు వివరణ కోరింది?
భారత రెజ్లింగ్ సమాఖ్య 15 పేజీల షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందులో వినేశ్ ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆరోపించింది. ఆమె చర్యల కారణంగా దేశానికి అవమానం కలిగిందని పేర్కొంది. ఆమె చర్యల వల్ల దేశానికి అవమానం కలిగిందని పేర్కొంది. భారత, ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యల రూల్స్, యాంటీ డోపింగ్ నిబంధనలు సైతం ఉల్లంఘించినట్లుగా ఆరోపించింది. మొత్తం నాలుగు అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు పరిమితి సాధించకపోవడంతో అనర్హతకు గురవడం, యాంటీ డోపింగ్ నిబంధనలు, నివాస వివరాలను వెల్లడించకపోవడం, 2024 మార్చిలో అప్పటి భారత ఒలింపిక్ సంఘం (IOA) నియమించిన అడ్‌హాక్ కమిటీ నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో రెండు బరువు విభాగాల్లో పోటీ చేయడం వంటి అంశాలను సమాఖ్య ప్రస్తావించింది.
ఎదురుదెబ్బ
వినేశ్ ఫొగాట్ తిరిగి రెజ్లింగ్ రింగ్‌లోకి రావాలనే యత్నాలకు భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయం భారీ ఎదురుదెబ్బగా మారింది. మే 10 నుంచి 12 వరకు గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొనాలని భావించినప్పటికీ, ప్రస్తుత నిషేధం కారణంగా దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎలాంటి యాంటీ డోపింగ్ ఉల్లంఘనలు లేవని సమాఖ్య నిర్ధారించుకోవాల్సిన బాధ్యత వినేశ్‌పై ఉందని.. అర్హత లేకుంటే భవిష్యత్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదని సమాఖ్య నోటీసుల్లో స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్
- ●US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!
- ●Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన రేవంత్
- ●Telangana Irrigation | కిం కర్తవ్యం? సాగునీటికి కటకటేనా..!

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!





