త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali Bonus | ఒక్కొక్క‌రికి రూ.ల‌క్ష‌.. ఉద్యోగుల‌కు గుజరాత్‌ వ్యాపారి దీపావ‌ళి బోన‌స్

Diwali Bonus | సాధార‌ణంగా పండుగ‌ల వేళ ఉద్యోగుల‌కు స్వీట్లు, బ‌హుమ‌తులు ఇచ్చి యాజ‌మాన్యాలు ఆనందం పంచుకుంటాయి. కొంద‌రు వ్యాపారులు భారీ న‌గ‌దుతోపాటు కార్లు, బైకులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేస్తారు.

G

National | Published On Nov 8, 2026, 8.36 am IST

Diwali Bonus | ఒక్కొక్క‌రికి రూ.ల‌క్ష‌.. ఉద్యోగుల‌కు గుజరాత్‌ వ్యాపారి దీపావ‌ళి బోన‌స్
Advertisement

Diwali Bonus | త్రినేత్ర న్యూస్‌: సాధార‌ణంగా పండుగ‌ల వేళ ఉద్యోగుల‌కు స్వీట్లు, బ‌హుమ‌తులు ఇచ్చి యాజ‌మాన్యాలు ఆనందం పంచుకుంటాయి. కొంద‌రు వ్యాపారులు భారీ న‌గ‌దుతోపాటు కార్లు, బైకులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేస్తారు. గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు (Surath Trader) చెందిన ఓ వ్యాపార‌వేత్త త‌న ఉద్యోగుల‌కు (Employees) రూ.ల‌క్షకుపైగా బోన‌స్‌గా (Diwali Bonus) ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో వెలుగుల పండుగ‌నాడు ఊహించ‌ని కానుక ల‌భించ‌డంతో ఉద్యోగుల సంతోషానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఆయ‌న ఔదార్యానికి భావోద్వేగానికి గుర‌య్యారు.

సూర‌త్‌లో వస్త్ర వ్యాపారం (Textile Trader) నిర్వహిస్తున్న రామ్‌స్వరూప్ ముండే తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ దీపావ‌ళికి మ‌ర‌చిపోలేని కానుక ఇవ్వాల‌నుకున్నారు. దీంతో మిఠాయిలు, ఇతర బహుమతులకు భిన్నంగా 20 మంది ఉద్యోగుల‌కు ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదును కొత్త కరెన్సీ నోట్ల రూపంలో అందజేశారు. రూ.10 నుంచి రూ.500 వరకు వివిధ విలువల నోట్లను (Currency Notes) వెండి రంగు పళ్లెంలో అందంగా అమర్చి ఉద్యోగులకు అందించారు. ఈ నగదును చూసిన ఉద్యోగులు తొలుత ఆశ్చర్యపోయారు. బహుమతిని అందుకున్న ఉద్యోగులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళా ఉద్యోగి ఆనందబాష్పాలు పెట్టుకోవడం అందరినీ కదిలించింది.

 

Advertisement
Advertisement