త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP leader | ప్ర‌ధాని పొదుపు సూచ‌న‌ల వేళ‌.. భారీ కాన్వాయ్‌తో వెళ్లిన బీజేపీ నేత‌

BJP leader | ప్ర‌జ‌లు ఇంధ‌న పొదుపు పాటించాలంటూ స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని పిలుపు వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ బీజేపీ నేత భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్ల‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

D

National | Published On May 12, 2026, 5.31 pm IST

BJP leader | ప్ర‌ధాని పొదుపు సూచ‌న‌ల వేళ‌.. భారీ కాన్వాయ్‌తో వెళ్లిన బీజేపీ నేత‌
Advertisement

BJP leader | పశ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇంధ‌న పొదుపు పాటించాలంటూ స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని పిలుపు వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ బీజేపీ నేత (BJP leader) వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బీజేపీ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్ (Saubhagya Singh Thakur).. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో టెక్స్ట్‌బుక్ కార్పొరేషన్ (Madhya Pradesh Textbook Corporation) నూతన చైర్మన్‌గా నియమితుల‌య్యారు. దీంతో బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు ఆయ‌న ఉజ్జ‌యిని నుంచి భోపాల్ (Bhopal)కు ప్ర‌యాణించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న త‌న మ‌ద్ద‌తుదారుల‌తో భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్లారు. సుమారు 50 ఎస్‌యూవీ కార్లు ఠాకూర్ వాహ‌నాన్ని అనుస‌రించాయి. ఠాకూర్‌కు స్వాగతం పలికేందుకు మద్దతుదారులు పలు చోట్ల వాహనాలను నిలిపివేయడంతో.. ఆ మార్గంలో చాలా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర‌ అంతరాయం ఏర్పడింది. ఫ‌లితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇరాన్ యుద్ధం కార‌ణంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌జ‌లు ఇంధ‌న పొదుపు పాటించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చిన మ‌రుస‌టి రోజే ఆయ‌న ఇలా భారీ కాన్వాయ్‌తో వెళ్ల‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు ఎక్కుపెట్టారు. సొంత పార్టీ నేత‌లే ప్రధాని మాట‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Also Read..

బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు టీవీకేకి షాక్‌.. ఓటింగ్‌లో ఆ ఎమ్మెల్యే పాల్గొన‌కూడ‌దంటూ ఆదేశం

పేప‌ర్ లీక్ క‌ల‌క‌లం.. నీట్ ప‌రీక్ష ర‌ద్దు చేస్తూ ఎన్టీయే కీల‌క ప్ర‌క‌ట‌న‌

స‌నాత‌నధ‌ర్మాన్ని నిర్మూలించాలి : ఉద‌య‌నిధి స్టాలిన్

Advertisement
Advertisement