త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్స‌వానికి నేను రాను : ర‌హ‌దారి నిర్మాణం ఆల‌స్యంపై గ‌డ్క‌రీ అస‌హ‌నం

Nitin Gadkari | ముంబై-గోవా జాతీయ ర‌హ‌దారి (Mumbai-Goa Highway) విస్త‌ర‌ణ ప‌నులు 15 ఏళ్లుగా కొన‌సాగుతుండ‌టంపై కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari) తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌నుల జాప్యంపై సిగ్గుగా ఉంద‌న్నారు. ఈ రహ‌దారి ప్రారంభోత్స‌వానికి తాను హాజ‌రుకాబోన‌ని తెగేసి చెప్పారు.

D

National | Published On Sep 10, 2026, 3.27 pm IST

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్స‌వానికి నేను రాను : ర‌హ‌దారి నిర్మాణం ఆల‌స్యంపై గ‌డ్క‌రీ అస‌హ‌నం
Advertisement

Nitin Gadkari | త్రినేత్ర‌.న్యూస్ : ముంబై-గోవా జాతీయ ర‌హ‌దారి (Mumbai-Goa Highway) విస్త‌ర‌ణ ప‌నుల్లో జాప్యంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అస‌హ‌నం వ్యక్తం చేశారు. ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల్లో 15 ఏళ్ల‌పాటూ జాప్యం జ‌ర‌గ‌డం సిగ్గుగా ఉంద‌న్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైనా.. ప్రారంభోత్స‌వానికి తాను హాజ‌రుకాబోన‌ని తెగేసి చెప్పారు.

గోవాలోని ప‌నాజీ (Panaji) స‌మీపంలో గ‌ల‌ పొర్వొరిమ్ (Porvorim)లో ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్ కారిడాన్‌ను గ‌డ్క‌రీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ముంబై-గోవా ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు ఆల‌స్యం కావ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. "ఈ హైవే పనులు ఇంత‌ ఆలస్యం కావడం సిగ్గుగా ఉంది. అందుకే దీని ప్రారంభోత్స‌వానికి నేను రాను. కానీ ఈ ర‌హ‌దారి ప్ర‌యాణికుల‌కు నిజంగా సౌక‌ర్య‌వంతంగా ఉందో లేదో స్వ‌యంగా ప‌రిశీలించేందుకు.. అక్టోబ‌ర్‌లో ముంబై నుంచి గోవా వ‌ర‌కూ రోడ్డు మార్గంలో ప్ర‌యాణిస్తాను" అని గ‌డ్క‌రీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ర‌హ‌దారి ప‌నుల్లో జాప్యానికి, నాణ్యత లోపాలకు కారణమైన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాన‌ని గ‌డ్క‌రీ హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో వెన‌క‌డుగు వేసేది లేద‌ని తేల్చి చెప్పారు. "ఏడాది లోపు పెద్ద సంఖ్య‌లో కాంట్రాక్ట‌ర్ల‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్ట‌డంతోపాటూ.. అధికారుల‌ను స‌స్పెండ్ చేసి రికార్డు సృష్టించాల‌నుకుంటున్నా" అని గ‌డ్క‌రీ వ్యాఖ్యానించారు.

కాగా, ముంబై-గోవా హైవే విస్తరణ ప్రాజెక్టు పనులు 2011లో మొదలయ్యాయి. పాత రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా మార్చి ఈ మార్గంలో ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గించే లక్ష్యంతో ఈ పనుల‌ను ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు ప‌నులు దాదాపు 15 ఏళ్లుగా కొన‌సాగుతూనే ఉన్నాయి. 2016కే పనులు పూర్తికావాల్సి ఉన్నా.. పలుమార్లు గడువులు మారాయి. 485 కిలోమీటర్ల మార్గంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 465 కిలోమీటర్లు నాలుగు లేన్ల ర‌హ‌దారి నిర్మాణం పూర్తైన‌ట్లు ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. 20 కిలోమీట‌ర్ల ప‌నులు మాత్ర‌మే మిగిలి ఉన్న‌ట్లు తెలిపింది. మిగిలిన పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే, ఆ గ‌డువు కూడా ఇప్ప‌టికే దాటిపోయింది. ప్రస్తుతం పనులు 93-94 శాతం పూర్తయినట్లు గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్తైన‌ట్లు తెలుస్తోంది.

Also Read..

ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్ నుంచి పిల్ల‌ల్ని ర‌క్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

టార్గెట్ రెడ్‌ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్‌.. ఢిల్లీ పేలుడుపై సంచ‌ల‌న విష‌యాలు

Advertisement
Advertisement