Toll Booths | ఇక టోల్ దగ్గర ఆగాల్సిన పనిలేదు!
Toll Booths | టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే అవసరం లేకుండా అడ్డంకులు లేని టోల్ వసూలు వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను 2027 మార్చి నాటికి అడ్డంకులు లేకుండా మారుస్తామని చెప్పారు.
- 2027 మార్చినాటికి సరికొత్త వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలు
- వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Toll Booths | టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే అవసరం లేకుండా అడ్డంకులు లేని టోల్ వసూలు వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను 2027 మార్చి నాటికి అడ్డంకులు లేకుండా మారుస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 శాతానికి పైగా టోల్ ప్లాజాల్లో ఈ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో గడ్కరీ మాట్లాడారు. ఫాస్టాగ్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఆదాయం రూ.82 వేల కోట్లు
ఫాస్టాగ్ వినియోగంతో టోల్ ప్లాజాల ఆదాయం ఇప్పటికే 10 శాతం పెరిగిందని, ప్రస్తుతం రూ.82వేల కోట్లకు పైగా చేరిందని గడ్కరీ చెప్పారు. దీని ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరిందన్నారు. అడ్డంకులు లేని టోల్ వసూలు విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే మరో 10 శాతం.. అంటే రూ.7వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. టోల్ ప్లాజాల నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గిందని తెలిపారు. గతంలో 12 శాతంగా ఉన్న నిర్వహణ వ్యయం ప్రస్తుతం 2–3 శాతానికి పడిపోయిందన్నారు.
వాహనదారులకు మేలు
అడ్డంకులు లేని టోల్ వసూలు విధానంతో ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోయే పరిస్థితి తగ్గుతుందని గడ్కరీ చెప్పారు. దీంతో ప్రయాణ సమయం ఆదా కావడంతోపాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుందన్నారు. అధ్యయనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.5,250 కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతోందని వెల్లడించారు. ట్రక్కుల్లో అధిక లోడును గుర్తించే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని టెక్నాలజిస్టులను గడ్కరీ కోరారు. దేశంలోని సరకు రవాణా రంగంలో పారదర్శకత కొరవడిందని, దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఓ ఆపరేటర్‌పై సీబీఐ కేసు నమోదు చేసిందని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mark Zuckerberg | మళ్లీ ఎక్స్‌లోకి జుకర్‌బర్గ్.. ఎందుకంటే?
- ●Abhijeet Dipke Fake Resignation Letter | మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా? గిరిజన పిల్లల మరణాలపై వైరల్ అవుతున్న 'లేఖ' వెనుక అసలు నిజం!
- ●Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు
- ●BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!
- ●Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం - వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
- ●Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు

Mark Zuckerberg | మళ్లీ ఎక్స్‌లోకి జుకర్‌బర్గ్.. ఎందుకంటే?

Abhijeet Dipke Fake Resignation Letter | మధ్యప్రదేశ్ సీఎం రాజీనామా? గిరిజన పిల్లల మరణాలపై వైరల్ అవుతున్న 'లేఖ' వెనుక అసలు నిజం!

Chiranjeevi | ఇరుముడి టీమ్‌కు మెగాభినందనలు

BRICS Dinner Menu | బ్రిక్స్ డిన్నర్లో ప్రపంచ నేతలకు వడ్డించిన మెనూ ఇదే..!





