ITR Refund | ఐటీఆర్‌ను ఫైల్ చేశాక రిఫండ్ ఎప్పుడు వస్తుంది.. రాకపోతే ఏం చేయాలి..?
ITR Refund | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను దాఖలు చేసిన చాలా మంది ప్రస్తుతం రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఈ దాఖలు గడువును జూలై 31గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ఆ తేదీ వరకు ఐటీఆర్‌ను ఫైల్ చేసిన వారు రిఫండ్ కోసం వేచి చూస్తున్నారు.
ITR Refund | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను దాఖలు చేసిన చాలా మంది ప్రస్తుతం రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఈ దాఖలు గడువును జూలై 31గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ఆ తేదీ వరకు ఐటీఆర్‌ను ఫైల్ చేసిన వారు రిఫండ్ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఆలస్య రుసుముతో ఐటీఆర్‌ను ఫైల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఫైల్ చేశాక రిఫండ్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నే ఇప్పుడు పన్ను చెల్లింపుదారుల్లో ఉత్పన్నమవుతోంది. రిఫండ్ స్టేటస్‌ను కూడా తరచూ చెక్ చేస్తున్నారు. ఐటీఆర్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా దాఖలు చేసి, ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసి ఉంటే సాధారణంగా రిఫండ్ రావడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే కొన్ని తప్పిదాల వల్ల రిఫండ్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
ఎంత సమయం పడుతుంది..?
అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (ఫైనాన్షియల్ ఇయర్ 2025-26)కు సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 కాగా ఆదాయపు పన్ను శాఖ వివరాల ప్రకారం.. ఈ గడువులోగా 5.9 కోట్లకు పైగా మంది తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. ఇప్పుడు గడువులోగా ఐటీఆర్ దాఖలు చేసిన వారు ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేసిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ రిఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై చివరి వారంలో ఐటీఆర్ దాఖలు చేసి, ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి సాధారణంగా 2 నుంచి 6 వారాల వ్యవధిలో రిఫండ్ వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా మందికి ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్యలోపు రిఫండ్ ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రిటర్న్‌లో ఏవైనా తప్పులు ఉండటం లేదా అదనపు వెరిఫికేషన్ అవసరమైతే మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
రిఫండ్ స్టేటస్ చెకింగ్ ఇలా..
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం ఈ-వెరిఫికేషన్ పూర్తైన తర్వాత సాధారణంగా 4 నుంచి 5 వారాల్లో రిఫండ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ గడువులోపు రిఫండ్ అందకపోతే, పన్ను చెల్లింపుదారులు తమ ఈ-మెయిల్‌తో పాటు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఏవైనా నోటీసులు లేదా లోపాల వివరాలు ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. అనంతరం ఈ-ఫైల్ ట్యాబ్‌లోకి వెళ్లి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఆప్షన్‌ను ఎంచుకుని సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను సెలెక్ట్ చేసి వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే పూర్తి రిఫండ్ స్టేటస్ కనిపిస్తుంది. కొన్ని సాధారణ కారణాల వల్ల కూడా రిఫండ్ ఆలస్యం అవుతుంది. బ్యాంక్ ఖాతాను ప్రీ వాలిడేట్ చేయకపోవడం, బ్యాంక్ ఖాతాలోని పేరు పాన్ వివరాలతో సరిపోలకపోవడం, తప్పు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు చేయడం, ఇప్పటికే మూసేసిన బ్యాంక్ ఖాతా వివరాలను ఐటీఆర్‌లో ఇవ్వడం వంటి కారణాల వల్ల రిఫండ్ నిలిచిపోతుంది. అలాగే పాన్, ఆధార్ లింక్ చేయకపోయినా రిఫండ్ విఫలమయ్యే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
తాజావార్తలు
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!






